క్రీడాకారులకు ప్రధానంగా క్రికెటర్లకు అభిమానులే బలం. తమను పిచ్చిఅభిమానంతో ఆరాధించే అభిమానులను అలరించడం కోసమే విరాట్ కొహ్లీ లాంటి స్టార్ క్రికెటర్లు...
క్రీడాకారులకు ప్రధానంగా క్రికెటర్లకు అభిమానులే బలం. తమను పిచ్చిఅభిమానంతో ఆరాధించే అభిమానులను అలరించడం కోసమే విరాట్ కొహ్లీ లాంటి స్టార్ క్రికెటర్లు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అదే అభిమానం హద్దులు మీరి ఇబ్బందిగా మారే పరిస్థితి ఇటీవలి కాలంలో ఎక్కువయ్యింది. హైదరాబాద్ రాజీవ్ స్టేడియంలో వెస్టిండీస్‌తో రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమాని ఒకరు మైదానంలో దూసుకొచ్చి అతనికి ముద్దు ఇవ్వబోయిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి అనుభవమే హిట్‌మ్యాన్ రోహిత్ శర్శకు ఎదురైంది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్స్‌లో ముంబయి తరఫున రోహిత్ శర్మ ఆడుతున్నాడు. బిహార్ జట్టు నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబయి ఛేదనను ప్రారంభించింది. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని అకస్మాత్తుగా మైదానంలోకి పరుగెత్తుకొని వచ్చి రోహిత్ శర్మకు కిస్ ఇవ్వబోయాడు. ఈ క్రమంలోనే రోహిత్ పాదాలను కూడా తాకబోయాడు. అనంతరం అభిమాని అమితానందంతో మళ్లీ తన స్థానానికి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
@Ateet_Sharma @manoj_dimri @vikrantgupta73 Rohit Sharma Fan In Vijay Hazare trophy pic.twitter.com/GGv6ehPvWb
— Abhinav Rai (@Abhinav9560) October 15, 2018
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire