ఇలా వెళ్లినందుకు కుటుంబానికి రూ.75వేల ఫైనేశారు!

Submitted by lakshman on Tue, 09/19/2017 - 18:18

మరుగుదొడ్డి ఆవశ్యకత గురించి ప్రచారం చేస్తూ.. అవగాహన కల్పించేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు. మరుగుదొడ్డి నిర్మాణానికి అనాసక్తి చూపడానికి కారణమేంటో తెలియదు కానీ బాహ్య ప్రదేశాల్లో బహిర్భూమికి వెళ్లేందుకే ఇప్పటికే వెళ్లేందుకే ఇప్పటికీ కొందరు మొగ్గు చూపతున్నారు. ఇక లాభం లేదనుకుని మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో పంచాయతీ పెద్దలు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయాన్ని అమలుపరిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రంభఖేడి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని పంచాయతీ పెద్దలు విస్తృత అవగాహన కల్పించారు. అయినా గ్రామంలో చాలా కుటుంబాల తీరు మారలేదు. ఇక ఎలాగైనా వీరిని మార్చాలనే నిర్ణయానికొచ్చిన పెద్దలు ఓ కుటుంబానికి మరుగుదొడ్డి నిర్మించుకోకుండా బాహ్య ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లినందుకు 75, 000 రూపాయల జరిమానా విధించారు. ఈ నిర్ణయంతో ఆ కుటుంబ సభ్యులు షాకయ్యారు.

ఆ కుటుంబంలో మొత్తం 10 మంది సభ్యులున్నారని.. ఒక్కొక్కరికి 250 రూపాయల చొప్పున నెలకు 75,000 చెల్లించి.. బాహ్య ప్రదేశాల్లో బహిర్భూమికి వెళ్లాలని గ్రామ పెద్దలు ఆదేశించారు. అంతేకాదు, వీరితో పాటు గ్రామంలోని మరో 43 కుటుంబాలకు బాహ్య ప్రదేశాల్లో బహిర్భూమికి వెళ్లొద్దని హెచ్చరిస్తూ నోటీసులు పంపించారు. పంచాయితీ పెద్దలు తీసుకున్న చర్యతో గ్రామస్తులు మెల్లిమెల్లిగా దారిలోకొస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీ అసిస్టెంట్ కున్వర్‌లాల్ మాట్లాడుతూ గ్రామస్తులకు ఇప్పటికే పలు సందర్భాల్లో బాహ్య ప్రదేశాల్లో బహిర్భూమి నిషేధం అని చెప్పామని, కానీ కొందరి తీరులో మార్పు రాలేదని ఆయన చెప్పారు. వారిని మార్చేందుకే జరిమానా విధించినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ రమ్రతీ భాయి మాట్లాడుతూ మరుగుదొడ్లు నిర్మించుకోకుండా గ్రామస్తులు ఇలానే ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

English Title
Family fined Rs 75,000 for defecating in the open in Madhya Pradesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES