కుటుంబాన్ని మింగేసిన ఒంటరితనం

Submitted by arun on Fri, 01/05/2018 - 15:30
family commit suicide

ఆస్తి పంపకాల్లో తలెత్తిన వివాదాలు ఆ కుంటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులను సైతం బలి తీసుకున్నాయి. అటు ఆర్ధికంగానూ ఇటు సామాజికంగానూ కృంగిపోయిన ఆ కుటుంబం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

విశాఖలోని ఆరిలోవ కాలనీలో ఓ కుటంబం విషాదగాధ ఇది. అందరూ ఉన్న అనాధల్లా తమ ఇద్దరు పిల్లలతో బతుకుబండిలాగిస్తున్న కుటుంబకథ ఇది. ప్రకాశం జిల్లా కణిగిరికి చెందిన రాజేష్ రెడ్డి, సౌమ్య దంపతులు  8 నెలల క్రితమే విశాఖ వచ్చి జీవనం సాగిస్తున్నారు. అన్న శ్రీనివాస్‌రెడ్డితో ఏర్పడ్డ ఆస్తి తగాదాలు, రోజు రోజుకు పెరుగుతున్న కష్టాలను భరించలేక భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు రాజేష్‌.

ఓ పక్క కొలిక్కిరాని కలహాలు మరోపక్క కన్నవారు సైతం కాదనుకోవడంతో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు రాజేష్ దంపతులు‌. కష్టాల కడలిని ఈదలేక రాజేష్‌, సౌమ్యలు  ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ తర్వాత తమ పిల్లలకు ఎలాంటి ఆధారం ఉండదని భావించిన రాజేష్‌ దంపతులు చావడానికి ముందు తమ పిల్లలకు విషం పెట్టి వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తండ్రికి చెప్పిమరీ సౌమ్య ఈ దారుణానికి పాల్పడింది. ముందే చెప్పినా కన్న కూతురిని కాపాడుకోలేకపోయానని సౌమ్య తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. 

ఆస్థి తగాదాలే రాజేష్‌‌రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించాయంటున్నారు బంధువులు. కేసుల విషయమై రాజీకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని..అంతలోనే ఇలాంటి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డం తమను కలచివేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు స్ధానికులు కూడా జరిగిన సంఘటన పట్ల నివ్వెరపోయారు ఎవరిజోలికి వెళ్లని కుటుంబం ఎందుకు ఇంత తీవ్రనిర్ణయం తీసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని, బతకడం చేతకాకే ఈ నిర్ణయం తీసుకున్నారని సుసైడ్ నోట్ దంపతులు తెలిపారని  సీఐ షణ్ముఖరావు తెలిపారు. క్షణికావేశం , ఒంటరితనం భరించలేక ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం పలువురిని కలిచివేసింది.

English Title
family commit suicide visakhapatnam

MORE FROM AUTHOR

RELATED ARTICLES