పేస్ బుక్ కు గండం.. వచ్చే ఏడాదే..!

Submitted by nanireddy on Sat, 12/16/2017 - 12:09
facebook issue

2018లో ఫేస్‌బుక్‌కు గండం వచ్చిపడింది. ఈ మేరకు రష్యాకు చెందిన టెలికాం సంస్థ అధిపతి అలెగ్జాండర్ ఝరోవ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మాస్కోలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ చట్టాలను అతిక్రమిస్తే.. 2018లో తమ దేశంలో ఫేస్‌బుక్‌ను పూర్తిగా నిషేధిస్తామని హెచ్చరించారు. ‘ఫేస్‌బుక్‌ మా చట్టాలను అనుసరించేలా పనిచేస్తాం. 2018లో కచ్చితంగా ఇది జరుగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

విదేశీ మెసేజింగ్‌ సర్వీసులు, సెర్చ్‌ ఇంజన్లు, సోషల్ మీడియా వెబ్‌సైట్లు రష్యన్‌ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి కావాల్సిన విధివిధానాలను పేర్కొంటూ 2014లో ప్రత్యేక చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం ఆ దేశస్థుల అన్ని విషయాలను రష్యాలోని సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలి. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర సోషల్ మీడియా వినియోగదారుల సమాచారాన్ని వారి అనుమతి లేకుండానే తీసుకుంటున్నారని ఈ సర్వీసులను అక్కడి టెలికం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఫేస్‌బుక్‌ తగిన నివారణ చర్యలు తీసుకోకుంటే లింక్డ్‌ఇన్‌ మాదిరిగానే రష్యాలో నిషేధిస్తామని ఝారోవ్‌ వెల్లడించారు.

Share

    English Title
    facebook issue

    MORE FROM AUTHOR

    RELATED ARTICLES