ఫేస్‌బుక్ యూజర్లకు శుభవార్త

ఫేస్‌బుక్ యూజర్లకు శుభవార్త
x
Highlights

భారత్‌లో సోషల్ మీడియా వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందులో మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన...

భారత్‌లో సోషల్ మీడియా వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందులో మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశం ఈ విషయంలో అమెరికానే మించిపోయింది. ఇంతలా భారతీయుల ఆదరణ పొందిన ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందిస్తూ మెరుగైన సేవలందిస్తున్న సంస్థగా పేరు తెచ్చుకుంది. మరిన్ని ఉపయోగకర ఆప్షన్స్‌ను అందుబాటులోకి తేవాలని ఫేస్‌బుక్ భావిస్తోంది. అందులో భాగంగానే ఓ కొత్త ఫీచర్‌పై ఫేస్‌బుక్ కసరత్తు చేస్తోంది. ఇన్నాళ్లూ ఫేస్‌బుక్‌లో మనం యాడ్ చేసుకున్న వారి పోస్ట్‌లు నచ్చకపోతే వారిని అన్‌ఫ్రెండ్ కానీ, అన్‌ఫాలో కానీ చేసేవాళ్లం. దీంతో వారు ఆ తర్వాత ఏం పోస్ట్ చేసినా కనిపించేది కాదు.

అన్‌ఫ్రెండ్, అన్‌ఫాలో చేయడమంటే వారితో బంధాన్ని పోస్టుల మూలాన పూర్తిగా తెంచుకోవడం లాంటిది. ఆ తర్వాత వారు ఎటువంటి ఉపయోగకర పోస్టులు పెట్టినా మనం వాటిని కోల్పోతాం. కానీ ఇక నుంచి అలా జరగకుండా ఉండేందుకు ఫేస్‌బుక్ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తోంది. స్నూజ్ అనే ఈ ఫీచర్‌ వల్ల పోస్ట్‌లను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది. మన ఫ్రెండ్, మనం ఫాలో అయ్యే పేజ్, గ్రూప్స్‌లో పోస్ట్ చేసే ఎటువంటి సమాచారాన్నైనా 24 గంటల వరకూ గానీ, 7రోజులు లేదా 30 రోజుల వరకూ గానీ నిలిపివేయవచ్చు. ఆ కాల పరిమితి తర్వాత మళ్లీ ఎప్పటిలానే వారి పోస్ట్‌లు మనకు కనిపిస్తాయి. త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories