మద్యం బాటిళ్లను రోలర్‌తో తొక్కించారు..

Submitted by arun on Thu, 07/12/2018 - 11:12
Foreign Liquor

మందుబాబులు బోరుమనే పనిచేశారు రాజేంద్రనగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు. ఒకటి కాదు రెండు కాదు వందలాది మద్యం బాటిళ్లను వరుసగా నేలపై పేర్చి రోడ్డు రోలర్‌ తొక్కించేశారు. దాంతో రాజేంద్రనగర్‌ ఎక్సైజ్‌ కార్యాలయ ఆవరణలో మద్యం ఏరులై పారింది. అత్యంత ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లను అలా రోడ్డు రోలర్‌తో తొక్కించడం చూసిన స్థానికులతోపాటు మందుబాబులు ఘొల్లుమన్నారు. అయ్యో ఖరీదైన మద్యం నేలపాలైందేనని తెగ బాధపడిపోయారు. 

శంషాబాద్‌లో ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్‌ చేసిన రాజేంద్రనగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు సుమారు 40లక్షల రూపాయల విలువైన 640 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలా స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను రాజేంద్రనగర్‌ ఎక్సైజ్‌ కార్యాలయ ఆవరణలో నేలపై వరుసగా పేర్చిన ఎక్సైజ్‌ పోలీసులు రోడ్డు రోలర్‌ తొక్కించి ధ్వంసంచేశారు. బెంగళూరు, చెన్నై సముద్ర మార్గాల ద్వారా విదేశీ మద్యాన్ని తీసుకొస్తూ అక్రమంగా విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్‌ పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో వలేసి స్మగ్లర్లను పట్టుకున్నామన్న ఎక్సైజ్‌ పోలీసులు సెక్షన్‌ 46 ప్రకారం అధికారుల సమక్షంలో ధ్వంసం చేసినట్లు తెలిపారు.

English Title
excise department crushing foreign wine with road roller

MORE FROM AUTHOR

RELATED ARTICLES