టీడీపీకి షాక్...రేపు వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే

Submitted by arun on Fri, 04/13/2018 - 15:56
YALAMANCHILI Ravi

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే  యలమంచిలి రవి వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఖారారైంది.  ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రేపు  విజయవాడ చేరుకోనున్న వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ‍యన పార్టీలో చేరనున్నారు. టీడీపీలో తనకు తగిన గౌరవం దక్కకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అధికార పార్టీలోని కొందరు తనను టార్గెట్ చేసుకున్నారంటూ ఆరోపించారు.  ప్రత్యేక హోదా విషయంలో సీఎం యూ టర్న్ లు బాధకలిగించాయన్న ఆయన జగన్ చేస్తున్న పోరాటాలను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు.  
 

English Title
ex mla yalamanchili ravi set join ysrcp

MORE FROM AUTHOR

RELATED ARTICLES