ప్రణయ్‌ హత్యలో మాజీ ఎమ్మెల్యే హస్తం? వీరేశంను కూడా విచారిస్తున్నారా?

Submitted by arun on Tue, 09/18/2018 - 13:16

సంచలనం సృష్టించన ప్రణయ్ హత్యకేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్టు నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ప్రణయ్ హత్యకు మొత్తం కోటి రూపాయాల ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. నల్గొండ గ్యాంగ్ తో కలిసి బీహార్ గ్యాంగ్ సుపారీ తీసుకుందన్నారు. అడ్వాన్స్ గా 18 లక్షలు తీసుకున్నారని విచారణలో తేలినట్టు ఎస్పీ రంగనాథ్ చెప్పారు. ప్రణయ్ ను చంపింది బీహార్ కు చెందిన వ్యక్తేనని తెలిపారు. నరిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశంని కూడా విచారిస్తున్నామని నల్గొండకి చెందిన ఐఎస్ఐఎస్ మాజీ టెర్రరిస్టులకు ప్రణయ్ హత్య కేసుతో సంబంధం ఉందన్నారు. 
  
అమృత, ప్రణయ్ ల డబ్ స్మాష్ వీడియో పబ్లిసిటీ అయిన తర్వాత, మారుతిరావు ప్రణయ్ పై బాగా కోపం పెంచుకున్నట్టు తెలుస్తోంది. గత మూడు నెలలుగా బీహార్ గ్యాంగ్ తో టచ్ లో ఉన్న మారుతిరావు, ప్రణయ్ హత్యకు భారీ సుపారీని ముట్టచెప్పేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రణయ్ ను హత్య చేసిన బీహర్ నిందితుడిని పోలీసులు నల్గొండ తీసుకెళ్తున్నారు. ముగ్గురు బీహార్ గ్యాంగ్ సభ్యులతో పాటు నిందితులు అందరినీ పోలీసులు.. సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. 

English Title
ex mla veeresham will interrogating says sp ranganath

MORE FROM AUTHOR

RELATED ARTICLES