ముఖ్యమంత్రిని కలిసిన మాజీ డీజీపీ నండూరి..ఆయన వ్యాఖ్యలు ఖండన

Submitted by nanireddy on Tue, 08/28/2018 - 10:36
ex dgp sambasivarao meets cm chandrababunaidu

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు కలిశారు. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సాంబశివరావు... చంద్రబాబును కలిశారు. కాగా...  సాంబశివరావు గత మూడు రోజుల క్రితం విశాఖపట్టణం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలిశారు. వీరిద్దరి మధ్య 20నిమిషాల పాటు చర్చలు జరిగాయి. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సాంబశివరావు ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇక ఆయన వ్యాఖ్యలను మాజీ డీజీపీ ఖండించారు. తాను ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. ఇదిలావుంటే మొన్న జగన్‌ను కలవడం, ఇప్పుడు చంద్రబాబును సాంబశివరావు కలవడం పట్ల పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

English Title
ex dgp sambasivarao meets cm chandrababunaidu

MORE FROM AUTHOR

RELATED ARTICLES