విశ్వం గుట్టు విప్పే సరికొత్త అస్త్రం

Submitted by arun on Sat, 02/10/2018 - 15:04
telescope

అనంత రహస్యాలను తనలో ఇముడ్చుకున్న విశ్వం గుట్టు విప్పేందుకు.. పరిశోధకులు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం భూమీపైన అత్యంత భారీ టెలిస్కోపును నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హవాయి ద్వీపంలో నిర్మాణాన్ని చేపట్టి 2026 లోగా కార్యాచరణకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. 

మబ్బుల మాటున.. ఊహకందని ఎన్నో రహస్యాలను తనలో ఇముడ్చుకున్న విశ్వం గుట్టు విప్పేందుకు పరిశోధనలు సిద్ధమవుతున్నాయి. గతంలో విశ్వం ఎలా ఉండేది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు లోను కానుందనే విషయాలను తెలుసుకునేందుకు సైంటిస్టులు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఐదు దేశాలు ఓ జట్టుగా కలిసి ఓ భారీ ప్రాజెక్టుకు రూపకల్పన శాయి. భూమిపైనే అత్యంత శక్తివంతమైన 30 మీటర్ల ఆప్టికల్ టెలిస్కోప్ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. 

ఈ టెలిస్కోపులో అత్యంత కీలకమైన ప్రధాన కటకం 30 మీటర్లు ఉంటుంది. ఇప్పటివరకు భూమిపై 8 నుంచి 10 మీటర్ల ఆప్టికల్‌ టెలిస్కోపులు మాత్రమే ఉన్నాయి. భారత్‌లో అయితే కేవలం 3.6 మీటర్ల టెలిస్కొపు ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. సరికొత్త 30 మీటర్ల టెలిస్కోప్‌ నిర్మాణానికి 140 కోట్ల డాలర్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. 

 ఈ ప్రాజెక్టును హవాయి దీవుల్లోని మౌనాకీయలో నిర్మిస్తున్నారు. హవాయి దీవులు సముద్రమట్టానికి దాదాపు 4000 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇక్కడి వాతావరణం చల్లగా, ప్రశాంతంగా, స్థిరంగా, అన్ని రకాల కాలుష్యాలకు దూరంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో విశ్వం నుంచి వెలువడే వివిధ రకాల కిరణాలను విశ్లేషించడం తేలికవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2026 నాటికి ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడానికి వందలమంది పరిశోధకులు శ్రమిస్తున్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టులో భారత్ తో పాటు కెనడా, చైనా, జపాన్‌, అమెరికాలోని చాలా సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయి. 
 

English Title
The era of extremely large telescopes

MORE FROM AUTHOR

RELATED ARTICLES