ప్ర‌శాంత్ కిషోర్ రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశం....వైసీపీలో కోత్త పంచాయితీ....

ప్ర‌శాంత్ కిషోర్ రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశం....వైసీపీలో కోత్త పంచాయితీ....
x
Highlights

ఎన్నికల వ్యూహాలు రచించడంలో గొప్ప పేరు దేశ రాజకీయాల్లో చాణిక్యుడిగా కీర్తి అధికారంలోకి వ‌చ్చేది మనమే.. అధికారం తెచ్చేది నేనే.. అంటూ అన్న ఆయనమాటలను...

ఎన్నికల వ్యూహాలు రచించడంలో గొప్ప పేరు దేశ రాజకీయాల్లో చాణిక్యుడిగా కీర్తి అధికారంలోకి వ‌చ్చేది మనమే.. అధికారం తెచ్చేది నేనే.. అంటూ అన్న ఆయనమాటలను సీరియస్ గా తీసుకున్నారు వైసీపీ అధినేత సంవత్సరం తిరిగేలోపలే ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగా ఆయ‌న వేరే పార్టీలో చేరారు దీంతో ఆపార్టీ నేత‌లు షాక్ కు గుర‌య్యారు ఇంత‌కీ ఆయ‌న్ని ఇక‌పై పార్టీ వ్యూహ‌క‌ర్త‌గా కొన‌సాగిస్తుందా లేదా ప్ర‌స్తుతం ఇదే అంశం హాట్ టాపిక్ గా కొనసాతుతోంది.

వైసీపీలో కోత్త పంచాయితీ తెర‌మీద‌కు వ‌చ్చింది.. పార్టీ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న ప్ర‌శాంత్ కిషోర్ రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశం చేశారు. బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ స‌మ‌క్షంలో జేడియూ లో చేరారు. అయితే ఆయ‌న రాజ‌కీయ పార్టీలో చేర‌డం అయ‌న‌కు మంచి విషయమే అయినా ఏపిలో వైసీపికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ కిషోర్ వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఇక‌పై ఆయ‌న పార్టీకి ప‌నిచేస్తారా లేదా అనే విష‌యంపై పార్టీలో చర్చలు జరుపుతున్నారు.

2019 ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేది ప్ర‌శాంత్ కిషోర్ అని వైసీపీ అధినేత జగన్ గత ప్లీనరీ సమావేశంలో ప్రకటించారు అప్పటి నుంచి పార్టీలో ప్ర‌శాంత్ కిషోర్ అలియాస్ పికే టీం కీల‌కంగా మారింది. ఇండియ‌న్ యాక్ష‌న్ క‌మిటీ పేరుతో రాష్టంలో పికే టీం హ‌ల్ చల్ చేసింది. 175 నియోజ‌క‌ర్గాల్లో స‌ర్వేలు, కార్య‌క్ర‌మాలు చేస్తూ గ‌త ఏడాది నుండి పార్టీకి ప‌నిచేస్తున్నారు. దాదాపు 200 మంది తో పికే టీం ప‌నిచేస్తుంది. వీరంతా నియోజ‌క‌ర్గాల్లో పార్టీ పరిస్థితి, ఇంచార్జుల పనితీరు వంటి అంశాలపై వివిధ రూపాల్లో సర్వేలు నిర్వహిస్తున్నారు..

వీటితో పాటు నియోజ‌క‌ర్గంలో పార్టీ పరిస్థితిపై అద్యయనం చేస్తూ అదిష్టానానికి నివేదికలు ఇస్తున్నారు దీంతో పార్టీలో ప్రశాంత్ కిషోర్ కీలకంగా మారాడు చాలా సందర్భాల్లో ప్ర‌శాంత్ కిషోర్ నివేదిక‌ ఆధారంగానే టికెట్లు ఇస్తామని జగన్ తెలిపారు దీనితో పాటు జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో కూడా పికే టీం కీలకంగా వ్యవహరిస్తోంది పాద‌యాత్ర‌పై సోష‌ల్ మీడియాలో ప్రచారం చేయడం పాదయాత్రపై ప్రజల అభిప్రాయాలు సేకరించడం పాద‌యాత్ర ద్వారానే పార్టీ న‌వ‌ర‌త్నాలను ప్ర‌చారం చెయ్య‌డం వంటి అంశాల‌ను పికే టీం చూసుకుంటుంది.

ఇదిలా ఉంటే ప్ర‌శాంత్ కిషోర్ రాజ‌కీయ పార్టీలో చేర‌డంపై పార్టీలో అస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది పార్టీలో ప్ర‌శాంత్ కిసోర్ పాత్ర ఉంటుందా లేక సైడ్ చేస్తారా అనేది ఆ చ‌ర్చ‌ల సారాశం. అయితే ప్ర‌శాంత్ కిషోర్ జేడియూ లో చేరడం జగన్ కి తెలుసని పార్టీకి చెందిన కీలక నేతలు చెబుతున్నారు. ప్ర‌శాంత్ కిషోర్ కి చెందిన ఐప్యాక్ సంస్థ‌తో ఎన్నిక‌ల వ‌ర‌కూ కాంట్రాక్టు ఉంది కనుక అది కోన‌సాగుతుందంటున్నారు. కొందరు సీనియర్ నేతలు మాత్రం దీనిని తప్పు పడుతున్నారు ఒక పార్టీలో ఉంటూ.. మరో పార్టీలో ఎలా చేరతారంటున్నారు. అదికూడా ఎన్డీఏ లో ఉన్న పార్టీతో చేరడం.. పార్టీకి మరింత ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.

ఇలా మెత్తానికి ప్ర‌శాంత్ కిషోర్ వ్య‌వ‌హారం వైసీపిలో కోత్త త‌ల‌నోప్పి తెచ్చిపెట్టింద‌ని చెప్పాలి అయితే పార్టీకి వ్యూహ‌క‌ర్త‌గా తొల‌గించి టీం ను స‌ర్వేల కోసం వాడుకుంటే మంచిద‌నేది మెజారిటీ నేత‌ల అభిప్రాయంగా తెలుస్తోంది. మ‌రి ప్ర‌వాంత్ కిషోర్ వ్య‌వ‌హారంపై అదినేత జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories