ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో సీఎం యోగికి షాక్

Submitted by lakshman on Wed, 03/14/2018 - 13:10
UP By-Election Results 2018 LIVE Updates: Samajwadi Party Extends Lead Over BJP Both In Gorakhpur And Phulpur

బీహార్ - ఉత్తరప్రదేశ్ లోకసభ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్ త‌గిలిన‌ట్లేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.  ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్, ఫూల్పూర్ స్థానాలకు, బీహార్‌లోని ఆరారియ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గోరక్‌పూర్ స్థానానికి, డిప్యూటీ సిఎం కేశవ ప్రసాద్ మౌర్య రాజీనామాలు చేయడంతో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

ఆ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుండ‌గా.. గోరక్ పూర్ స్థానంలో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ బిజెపి అభ్యర్థిపై ఆరు వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఉన్నారు. పుల్పూరులో ఎస్పీ అభ్యర్థి బిజెపి అభ్యర్థిపై 16 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
సీఎంయోగి ఆదిత్యానాథ్‌కు పెట్టని కోటగా ఉంటూ వస్తున్న గోరక్‌పూర్ లోకసభ స్థానంలో ఎస్పీ అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి అభ్యర్థి ఉపేంద్ర దత్ శుక్లపై ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ 1,500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. 
రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉంటూ వచ్చిన బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) దోస్తీకి కూడా ఇది పరీక్షలాంటిదే. ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయి. ఈ ఉప ఎన్నికలను యోగి ఆదిత్యానాథ్ వచ్చే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా భావిస్తున్నారు. రెండు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. బిజెి, ఎస్పీ, కాంగ్రెసు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండు స్థానాల్లోనూ ఎస్పీ అభ్యర్థులను మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ బలపరిచింది. 2017 శాసనసభ ఎన్నికల్లో ఎస్పీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెసు సొంతంగా అభ్యర్థులను నిలబెట్టింది. గోరక్‌పూర్ లోకసభ స్థానానికి యోగి ఆదిత్యానాథ్ ఐదు విడతలు ప్రాతినిధ్యం వహించారు.

2017 శాసనసభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పుల్పూర్ స్థానానికి మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అది కాంగ్రెసు సీటుగా పేరు పొందింది. అయితే తొలిసారి 2014 ఎన్నికల్లో బిజెపి కైవసం చేసుకుంది. ఆ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన కేశవ్ ప్రసాద్ మౌర్య విజయం సాధించారు. 

English Title
UP By-Election Results 2018 LIVE Updates: Samajwadi Party Extends Lead Over BJP Both In Gorakhpur And Phulpur

MORE FROM AUTHOR

RELATED ARTICLES