అమావాస్య వెలుగులు పంచేదెవరికి? చీకట్లు నింపేదెవరికి?

అమావాస్య వెలుగులు పంచేదెవరికి? చీకట్లు నింపేదెవరికి?
x
Highlights

సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అయ్యే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు... ఎన్నికల తేదీలు కలిసొచ్చేనా..? జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాబలంతో పాటు.. ఏ పని...

సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అయ్యే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు... ఎన్నికల తేదీలు కలిసొచ్చేనా..? జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాబలంతో పాటు.. ఏ పని చేయాలన్నా దానికి ఖచ్చితంగా ముహూర్తాలను ఫాలో అయ్యే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌‌కు .....ఇప్పుడే అసలు సమస్య మొదలైలయింది. ఎలక్షన్ రన్‌లో ఇప్పటివరకు కేసీఆర్ కు అంతా అనుకూలంగానే జరిగినా..పోలింగ్ తేది మాత్రం ఫీవర్ పుట్టించేలా ఉంది. లక్కీ నంబర్ చూసుకొని మరీ ఎన్నికల బరిలోకి దిగిన కేసీఆర్ కు ఈసీ ప్రకటన కొంచెం ఇష్టం..కొంచెం కష్టంగా మారింది. అచ్చొచ్చిన ఆరో తేదినే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా డిసెంబర్ 7 అమావాస్య రోజున పోలింగ్ తేది రావటం లక్ ఫ్యాక్టర్ పై అనుమానాలు పెంచుతోంది. కర్ణాటకలోనూ అమావాస్య రోజునే పోలింగ్ జరగా... బీజేపీ విజయం ముందు బోర్లా పడింది. అయితే ఈసీ ప్రకటించిన తేదీల్లో ఎక్కడా కేసీఆర్ అదృష్ట సంఖ్య లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్‌ సాంప్రదాయాలు, సెంటిమెంట్లను ఎక్కువ విశ్వసిస్తారు. వేసుకునే డ్రెస్‌ నుంచి కూర్చొనే కుర్చీ వరకు ప్రతి విషయంలో జాతకాలు, వాస్తును, న్యూమరాలజీని బలంగా నమ్ముతారు. తిధులు, వార, నక్షత్ర బలాన్ని చూసి మరీ ఏ పనైనా మొదలు పెడుతున్నారు. అంతేకాక ప్రతి విషయాన్నీ పండితులతో చర్చించి తన పనులు మంచి ముహూర్తాలు నిర్ణయించి స్టార్ట్ చేస్తారు. అలాంటి కేసీఆర్‌కు ఈసీ ప్రకటించిన ఎన్నికల తేదీ..కష్టాన్ని తెచ్చిపెట్టింది.

ముందస్తు ఎన్నికలకు రెడీ అయినా కేసీఆర్‌కు ఎన్నికల తేదీలు అమావాస్య తలనొప్పిగా మారింది. డిసెంబర్‌ 7న ఎన్నికలు 11న కౌంటింగ్‌ తేదీలు కేసీఆర్‌కు అస్సలు కలిసొచ్చే అంకెలు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్‌ 6 బ్లాక్ డే కావడంతో ఈసీ 7న ప్రకటించగా... 11న ఫలితాలను ప్రకటించింది. ఫలితాలు 11న మంగళవారం వారంతో... ఇక్కడ మంగళవారాన్ని శుభసూచకం కాదని భావిస్తారు. డిసెంబరు 6వ తేదీన మధ్యాహ్నం 11గంటల 59 నిమిషాలకు అమావాస్య గడియలు వచ్చి.. డిసెంబరు 7వ తేదీన మధ్యాహ్నం 12.16 గంటలకు వెళ్లిపోతుంది. అంటే సరిగ్గా డిసెంబరు 7వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుందంటే.. అమావాస్య వేళ ప్రారంభమవుతున్నట్లు లెక్క. దీంతో అమావాస్య ప్రభావాన్ని తప్పించడాని కేసీఆర్ గ్రహశాంతులు, ఇతర పూజాది కార్యక్రమాలు చేస్తున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి.

మరోవైపు ఎన్నికల షెడ్యూల్ లో కేసీఆర్ కు అనుకూలించే మరో అంశం ప్రభుత్వ ఏర్పాటు తేది. డిసెంబర్ 11 నాటికి ఫలితాలు వెలువడుతాయి. ఆ తర్వాత 15 తేదిన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దీంతో ఒకటి ప్లస్ ఐదు ఆరు అవుతుంది. ఆరు కేసీఆర్ లక్కీ నెంబర్ కావటంతో అమావాస్య ఎఫెక్ట్ నుంచి కేసీఆర్ గట్టెక్కుతారని గులాబీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories