తెలంగాణ ఓటర్ల తుది జాబితా విడుదల

Submitted by santosh on Mon, 11/26/2018 - 18:32
telangana

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను విడుదల  చేసింది ఎన్నికల కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 80 లక్షల64 వేల 684 వందల మంది ఓటర్లు ఉన్నారు. 2014 లోక్ సభ ఎన్నికలతో పొలిస్తే ఈ సారి తెలంగాణలో ఓటర్లు సంఖ్య తగ్గింది.తెలంగాణ ఓటర్ల జాబితా తుది జాబితాను విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఓటర్ల లిస్ట్ ల్లో అవకతవకలు జరిగాయని, సుమారు 20 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తూ కాంగ్రెస్  హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ఎన్నికల సంఘం సైతం స్పందించింది. దిద్దుబాటు చర్యలకు ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో నామినేషన్ల విత్ డ్రా తర్వాత ఓటర్ల జాబితాను అలస్యంగా విడుదల చేసింది ఈసీ.  రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 80 లక్షల64 వేల 684 వందల మంది ఓటర్లు ఉన్నారు. అందులో  లక్షా 41 వేల 56 వేల 182 మంది పురుష ఓటర్లు  కాగా,  1 లక్ష 39 వేల 581 వేలమంది మహిళా ఓటర్లు  ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,691 మంది ఉన్నారు. 

2014 లోక్‌సభ ఎన్నికల పోలిస్తే ఈ సారి ఓటర్ల సంఖ్య తగ్గింది. 2014లో మొత్తం 2.82 కోట్ల ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మంలోని 7 మండలాలు ఏపిలోకి కలవడం, హైదరాబాద్ లో ఉన్న కొందరు స్థానియలు సొంత ప్రాంతాలకు వెళ్లారు. ప్రధానంగా ఆధార్ కార్డులో అనుసందానంతో డూప్లికేట్ ఓటర్ల సంఖ్య తగ్గినట్లు ఈసీ వర్గాలు అంటున్నాయి. 119 అసెంబ్లీ స్థానాలకు 1,821 మంది అభ్యర్థులు పోటిపడుతున్నారు. మల్కాజ్ గిరిలో అత్యధికంగా 42 మంది పోటీ పడుతున్నారు. బాన్స్ వాడలో కేవలం 6 గురు మాత్రమే పోటి పడుతున్నారు.

English Title
Election Commission Released Voters Final list in Telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES