అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తం..

అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తం..
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది ఈసీ....

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది ఈసీ. ఎలక్షన్ ముగిసే వరకూ మినిట్ టు మినిట్ రిపోర్ట్ అందించాలని అబ్జర్వర్లకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ప్రమత్తమయ్యారు. ఎన్నికల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం ప్రత్యేక అబ్జర్వర్ లను నియమించారు. అభ్యర్థుల ప్రచారం, ఖర్చులు, పోలింగ్ వ్యవహారాలన్నింటిని క్షణాల్లో తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఉన్న పలు జిల్లాలకు కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్ లను నియమించింది.

ఎన్నికల్లో జనరల్ అబ్జర్వర్లుగా 68 మందిని నియమించారు. దీంతో పాటుగా పది మంది పోలీస్ అధికారులను స్పెషల్ అబ్జర్వేషన్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఆదేశాలుజారీ చేశారు. మరో 40 మంది అధికారులను.. అభ్యర్థుల ఖర్చుపై నివేదిక అందించే విధంగా ప్రత్యేక అధికారులగా నియమించారు. వీరు జనంలో మ ప్రజలతో మమేకమై అభ్యర్థుల ఖర్చు అంచనా వేస్తారు అభ్యర్థుల ఖర్చు పరిధి దాటితే సీఈసీకి తెలియజేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు.

ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో భద్రత అంశాలు, ఏర్పాట్లపై తెలంగాణ డీజీపీ మహేంధర్ రెడ్డి, నోడల్ అధికారి లా అండ్ ఆర్డర్ అదనపు డిజి జితేంధర్ తో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు భేటీ అయ్యారు. సమస్యాత్మాక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు అంశాలపై చర్చించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగియడంతో ప్రచారాలు, సమావేశాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే జిల్లాలకు చేరుకున్న అబ్జర్వేషన్ అధికారులు.. అభ్యర్థుల క్రిమినల్ డేటాను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.. మొత్తానికి ఎన్నికల నేపథ్యంలో ఈసీ అభ్యర్థుల కదలికలపై ఓ కన్నేసి ఉంచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories