ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

Submitted by arun on Sat, 10/06/2018 - 15:49
opr

తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాంలతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. త్వరలోనే అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణలో ఇవాల్టి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు.

-తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 11న ఫలితాలు విడుదల కానున్నాయి.
-ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 12న మొదటి దశ, 20న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. 
-మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 13న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అదే నెల 28న ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ జరగనుంది.
-మిజోరం రాష్ర్టంలో కూడా నవంబర్ 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
-రాజస్థాన్ రాష్ర్ట అసెంబ్లీకి కూడా డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహించనున్నారు.

English Title
Election In 5 States From November 12 To December 7, Results On December 11

MORE FROM AUTHOR

RELATED ARTICLES