ఖుష్బూపై కోడిగుడ్లు, టమోటాలతో దాడి

ఖుష్బూపై కోడిగుడ్లు, టమోటాలతో దాడి
x
Highlights

ప్రముఖ సినీనటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూపై గుర్తు తెలియని వ్య‌క్తులు కొంద‌రు కోడిగుడ్లు, టమాటాల‌తో దాడి చేయ‌డం చర్చ‌నీయాంశంగా మారింది. 2015 లో మహిళల...

ప్రముఖ సినీనటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూపై గుర్తు తెలియని వ్య‌క్తులు కొంద‌రు కోడిగుడ్లు, టమాటాల‌తో దాడి చేయ‌డం చర్చ‌నీయాంశంగా మారింది. 2015 లో మహిళల మానం గురించి ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఆమెపై కేసులు నమోదయ్యాయి. కేసు విచారణకు గాను ఖుష్బూ బుధవారం మేటూర్ కోర్టుకు హాజరయ్యారు. ఆ సందర్భంలో నిరసనకారులు ఆమె కారుపై దాడికి పాల్పడ్డారు. అటు-ఈ కేసు విచారణను కోర్టు ఈనెల 6 వ తేదీకి వాయిదా వేసింది.

ఈ చర్యలను ఖండిస్తూ మేటూర్‌ తహసీల్దారు ఫిరోజ్‌ఖాన్‌ పాట్లాలిమక్కల్‌ కట్చికి చెందిన 41మందిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు .అయితే ఖుష్బూ చేసిన కామెంట్స్ అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌నం సృష్టించాయి. సేలంకి చెందిన పాట్టాలి మ‌క్క‌ల్ క‌ట్చి త‌ర‌పు న్యాయ‌వాది మురుగన్ మేటూర్ కోర్టులో ఖుష్బూ పై పిటీష‌న్ వేయడంతో ఈ కేసు ఇప్పుడు విచార‌ణ‌కి వ‌చ్చింది. విచార‌ణ స‌మ‌యంలో మెజిస్ట్రేట్ ఖుష్బూని కొన్ని ప్ర‌శ్న‌లు వేసి, ఆమె స‌మాధానాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని మార్చి 6న దీనిపై మ‌రో విచార‌ణ జ‌ర‌ప‌నున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories