విజయరామారావు కుమారుడి నివాసంలో ఈడీ సోదాలు

Submitted by arun on Tue, 10/09/2018 - 11:22

సీబీఐ మాజీ డైరెక్టర్‌ విజయరామారావు కుమారుడు.. బిజినెస్‌ మెన్‌ అయిన శ్రీనివాస్‌ పై ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ ఫోకస్‌ చేసింది. సోమవారం రాత్రి నుంచి శ్రీనివాస్‌ ఆస్తులపై సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోని శ్రీనివాస్‌ నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కర్ణాటకకు చెందిన ప్రముఖ బ్యాంకు నుంచి 315 కోట్ల రుణం తీసుకున్న శ్రీనివాస్‌ ఇప్పటివరకు చెల్లించలేదు. అంతేకాకుండా రుణం పొందే క్రమంలో తనాఖా పెట్టిన ఆస్తులు కూడా నకిలీవని బ్యాంకు గుర్తించింది. దీంతో బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు 2016 లోనే శ్రీనివాస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఉన్న ఆధారాల మేరకు ఈడీ అధికారులు కూడా సోదాలు చేపట్టారు. 

English Title
ED Raids On Vijaya Rama Rao Son Offices

MORE FROM AUTHOR

RELATED ARTICLES