రేవంత్ రెడ్డి అరెస్ట్‌ ఎపిసోడ్‌లో ఈసీ చర్యలు...ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు

Submitted by arun on Wed, 12/05/2018 - 13:40
sp

రేవంత్ రెడ్డి అరెస్ట్‌ ఎపిసోడ్‌పై ఈసీ కన్నెర్ర చేసింది. పార్టీ అభ్యర్ధిగా ఉన్న రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడంపై కొరడా ఝుళిపించింది. వికారబాద్ ఎస్పీగా ఉన్న అన్నపూర్ణపై బదిలీ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమె స్ధానంలో అవినాష్ మహంతిని నియమిస్తూ తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది.  డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ అన్నపూర్ణను ఈసీ ఆదేశించింది. రేవంత్ అరెస్ట్ సందర్భంగా ఎస్పీ తీరుపై సీరియస్ అయిన  ఈసీ ఎస్పీ అన్నపూర్ణను విధుల నుంచి తప్పిస్తూ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు ఎటాచ్ చేసింది. ఎన్నికల విధులకు అన్నపూర్ణను కేటాయించవద్దని సూచించిన ఈసీ మరోవైపు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీసీఎస్‌ డీసీపీ అవినాష్ మొహంతి తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. 

English Title
EC Transfers Vikarabad SP Annapurna to Head Quarters

MORE FROM AUTHOR

RELATED ARTICLES