కొడంగల్ లో ఐటీ శాఖ సోదాలు...పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం

x
Highlights

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఇదే సమయంలో డబ్బు ప్రవాహం పెరుగుతోంది. తాజాగా కొడంగల్ లో ఐటీ శాఖ నిర్వహించిన...

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఇదే సమయంలో డబ్బు ప్రవాహం పెరుగుతోంది. తాజాగా కొడంగల్ లో ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. పట్టుబడ్డ నగదు వ్యవహారంపై ఈసీ ఆరా తీసింది. అయితే డబ్బు ఎవరిది ఎవరి ద్వారా వచ్చింది అనే అంశాలపై ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకున్నది.

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది డబ్బు ప్రవాహం పెరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు వంద కోట్లకు పైగా సీజ్ చేశారు. కొడంగల్ లో ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం రాజకీయంగా కలకలం రేపుతోంది. అనూహ్యంగా కొడంగల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇంట్లో, ఇతరత్రా ఆస్తులపై ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 51 లక్షలు పట్టుబడ్డట్లుగా ఈసీ నిర్ధారణకు వచ్చింది. కొడంగల్ లో ఐటీ సోదాల్లో పట్టుబడిన నగదుపై రాష్ర్ట ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. పక్కా సమాచారంతోనే ఐటీ సోదాలు జరిగాయన్నారు. ఇప్పటి వరకు 104.41 కోట్ల నగదు, మధ్యం స్వాధీనం చేసుకున్నట్లు రజత్ కుమార్ తెలిపారు. ఈసీ ఎవరికి అనుకూలంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన అభ్యర్ధులపై ప్రజాప్రాతినిధ్యం చట్టాన్ని ఉపయోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్ధులు వాడిన మాటలు.. రెచ్చగొట్టే ప్రసంగాలపై ఈసీ సీరియస్ అయ్యింది. అభ్యర్ధుల జాబితాను నియోజకవర్గాల వారీగా సీఈఓ వెబ్ సైట్ లో పెడుతామన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోనూ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో ఎప్పటికప్పుడు కో ఆర్డినేషన్ చేస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పొరుగురాష్ర్టాల నుంచి మద్యం, నగదు, గంజాయి సరఫరా కాకుండా చర్యలు చేపట్టామన్నారు రజత్ కుమార్. ఎన్నికల బందో బస్తుకు 179 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయని మరో వంద బలగాలు వస్తాయని వెల్లడించారు. బ్యాలెట్ ముద్రణ, ఈవీఎంల కేటాయింపు వచ్చే నెల ఒకటో తేది వరకు పూర్తవుతుందన్నారు. ప్రతి ఓటరుకు ఓటర్ స్లిప్ ఇస్తామని దాని వెనుక పోలింగ్ కేంద్రం వివరాలు ఉంటాయని చెప్పారు. మొత్తం మీద కొడంగల్‌లో పట్టుబడిన నగదు వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఎలాంటి వివరాలు వెల్లడిస్తారో అన్నది రాజకీయ పార్టీల్లో ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories