తెలంగాణలో ఎన్నికల కోడ్‌ కష్టాలు...నగదు, బంగారం తీసుకెళ్తున్నారా? అయితే జాగ్రత్త!

x
Highlights

విలువైన వస్తువుల్ని కొనుగోలు చేశారా? పెద్ద మొత్తంలో లావాదేవీలు చేశారా? పెద్ద మొత్తంలో నగదు మీ వెంట తీసుకెళ్తున్నారా? మీ ఇంట్లో శుభకార్యాల కోసం బంగారం...

విలువైన వస్తువుల్ని కొనుగోలు చేశారా? పెద్ద మొత్తంలో లావాదేవీలు చేశారా? పెద్ద మొత్తంలో నగదు మీ వెంట తీసుకెళ్తున్నారా? మీ ఇంట్లో శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేశారా? మీ రోజువారీ అవసరాల కోసం చిన్న మొత్తం డబ్బు క్యారీ చేస్తున్నారా? అయితే జాగ్రత్త? మీ వెంట తీసుకెళ్తున్న నగదు, బంగారానికి ఆధారాలు లేకుంటే చిక్కుల్లో పడతారు. బ్యాంకు నుంచి డబ్బు తీసుకెళ్తున్నా? ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసినా సరే ప్రతి రూపాయికీ మీరు లెక్క చెప్పాల్సిందే. ఒకవేళ మీరు వ్యాపారులైతే అమ్మకాలు కొనుగోళ్లపై కచ్చితంగా రసీదులు చూపాలి. ఆస్పత్రి బిల్లు కట్టేందుకు తీసుకెళ్తున్న డబ్బుకి కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది. సరైన ఆధారాలు, పత్రాలు చూపించకపోతే మీ డబ్బు, వస్తువులపై ఆశలు వదులుకోవడమే కాదు విచారణను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తెలంగాణలో ఎన్నికల కోడ్‌ సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులపాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతోన్న ఎన్నికల కమిషన్‌ కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా నగదు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఉక్కుపాదం మోపుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిఘా పెట్టి‌ ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతోంది. ఏమాత్రం అనుమానం వచ్చినా డబ్బును సీజ్ చేస్తున్నారు. దాంతో రోజువారీ అవసరాల కోసం చిన్న మొత్తంలో డబ్బు తీసుకెళ్తున్న సామాన్యులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు.

ఎన్నికల కోడ్‌ నిబంధనల ప్రకారం ఆధారాలు లేకుండా అధిక మొత్తంలో నగదు, బంగారం, విలువైన వస్తువుల్ని తీసుకెళ్తే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలా సీజ్ చేసిన నగదు లేదా వస్తువుల్ని విచారణ జరిపి, సరైనవని తేలితే ఎన్నికలు ముగిసిన తర్వాతే ఇస్తామని చెబుతున్నారు. అయితే ఎంత డబ్బు తీసుకెళ్లవచ్చో ఏవేమీ తీసుకెళ్లకూడదో తెలియక సామాన్య ప్రజానీకం తికమకపడుతున్నారు. అయితే ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదంటోన్న ఎన్నికల అధికారులు 20వేలైనా 20లక్షలైనా మీ వెంట తీసుకెళ్లే నగదుకు ఆధారాలు ఉంటే చాలంటోంది. ఎన్నికల కోడ్‌తో తెలంగాణలో సామాన్యులు, వ్యాపారస్తులు బెంబేలెత్తిపోతున్నారు. చిన్న మొత్తానికి, చిరు లావాదేవీలకు కూడా లెక్కలు అడుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories