22 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్నది అవాస్తవం: రజత్‌కుమార్

22 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్నది అవాస్తవం: రజత్‌కుమార్
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. ఎన్నికల్లో సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఓట్లు...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. ఎన్నికల్లో సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఓట్లు గల్లంతైనవారు తిరిగి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల నమోదుకు నిరంతరం కార్యక్రమాలు చేపట్టామన్నారు. 22 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్నది అవాస్తవమని చెప్పారు. ప్రతి ఏడాది జనవరిలో ఓటర్‌ లిస్ట్‌లో పేర్లు చెక్‌ చేసుకోవాలని రజత్‌కుమార్‌ సూచించారు. తెలంగాణలో కొత్తగా అసెంబ్లీ ఏర్పాటైందని, ఈ మేరకు గవర్నర్‌కు నోటిఫికేషన్‌ను అందజేసినట్లు ఆయనచెప్పారు. అంతకుముందు రజత్ కుమార్ గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేల ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేసి ఈసీకి సీఈవో పంపారు. గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గవర్నర్‌ నరసింహన్‌ గెజిట్‌ రూపంలో విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories