3 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

Submitted by arun on Thu, 01/18/2018 - 13:02
Assembly elections 2018

దేశంలో మూడు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 18న త్రిపుర, ఫిబ్రవరి 27న మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ ప్రకటించారు. మార్చి 3న మూడు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్‌లను ఉపయోగించనున్నట్లు సీఈసీ తెలిపారు. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు.

English Title
EC to announce poll dates for 3 north-eastern states

MORE FROM AUTHOR

RELATED ARTICLES