ప్రగతి నివేదన సభకు గంట ముందు కేబినెట్ భేటీ

ప్రగతి నివేదన సభకు గంట ముందు కేబినెట్ భేటీ
x
Highlights

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమైందా? టీఆర్‌ఎస్‌ కొంగర కలాన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రగతి...

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమైందా? టీఆర్‌ఎస్‌ కొంగర కలాన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు కేవలం కొన్ని గంటల ముందే కేబినెట్ భేటీ కానుండటం ఇవే సంకేతాలిస్తోంది. ప్రగతి నివేదన సభకు ఒక రోజు ముందు లేదా ఒక రోజు తరువాత కేబినెట్‌ భేటీ నిర్వహించుకునే అవకాశం ఉన్నా బహిరంగ సభ ప్రారంభానికి గంట ముందే ఈ సమావేశం జరగనుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపడంతోపాటు అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మానం చేయవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనుంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అధికార పార్టీ సర్వం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత కేబినెట్ సమావేశం ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, సెప్టెంబరు 2న ప్రగతి నివేదన సభ జరిగే రోజు గంట ముందు ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది.

పెండింగ్‌లో ఉన్న శాఖాపరమైన అంశాలను యుద్ధప్రాతిపదికన కేబినెట్ పంపాలని జీఏడీ సర్కులర్ జారీ చేసింది. ప్రధానంగా కొత్త జోనల్‌కు గ్రీన్‌ సిగ్నల్ పడటంతో అందుకు సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్స్‌పై కేబినెట్ దృష్టిసారించింది. దీంతోపాటు అసెంబ్లీ రద్దైతే కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడంతో ముందుగానే కొత్త పథకాలు, పెండింగ్ ఫైల్స్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

ఇప్పటికే 42 డిపార్టుమెంట్స్‌ ప్రతిపాదనలు చీఫ్ సెక్రటరీకి చేరాయి. ఇక కేంద్రం ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ డీఏ పెంచనున్నారు. అంతేకాక వారికి పీఆర్సీ మధ్యంతర భృతి చెల్లించనుంది సర్కార్. బీసీ కులాల భవనాలకు నిధుల కేటాయింపులు, అర్చకులు, మౌజమ్‌లకు జీతాల పెంపు లాంటి అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మొత్తానికి కేంద్రం నుంచి వచ్చిన గ్రీన్‌ సిగ్నల్స్‌తో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. దీనికోసం ఆదివారం జరిగే కేబినెట్ అత్యంత కీలకమైందిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories