నటుడి అరెస్ట్.. రోడెక్కిన ఇద్దరు భార్యలు

Submitted by arun on Mon, 09/24/2018 - 14:25
‘Duniya’ Vijay

వివాదాస్పద కన్నడ నటుడు దునియా విజయ్‌పై మరోసారి కేసు నమోదైంది. జిమ్ ట్రైనర్ మారుతి గౌడతో గొడవకు దిగి, ఆయనను కొట్టిన కేసులో విజయ్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో ఆయన పెద్ద భార్య నాగరత్న, చిన్న భార్య కీర్తి గౌడలు గొడవ పడ్డారు. నాగరత్నకు ముగ్గురు పిల్లలుండగా, ప్రస్తుతం విజయ్‌ చిన్నభార్య కీర్తిగౌడతో ఉంటున్నాడు. మారుతి గౌడతో గొడవ జరిగిన వేళ, నాగరత్న కుమారుడు సామ్రాట్‌, తన తండ్రితోనే ఉన్నాడు. తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆగ్రహానికి లోనైన నాగరత్న, కీర్తిగౌడ ఇంటికి వెళ్లి నిలదీయగా, ఆమె దగ్గరుండే బౌన్సర్లు అనుచితంగా ప్రవర్తించారట. ‘నాకు సంసారం లేకుండా చేశావు, పిల్లలను దూరం చేయాలనుకుంటున్నావా..’ అంటూ నాగరత్న ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈమేరకు బౌన్సర్‌ల ద్వారా దాడి చేయించారని గిరినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం కీర్తిగౌడ కూడా పోలీ‌స్‌స్టేషన్‌లకు వెళ్ళి ప్రతిఫిర్యాదు చేశారు. ఇలా పోలీస్‌ స్టేషన్‌తోపాటు కోర్టు, జైలు చుట్టూ దునియా విజయ్‌ తిరుగుతుండగా ఇటువైపు భార్యలు పోలీ‌స్‌స్టేషన్‌లకు వెళ్ళడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

English Title
‘Duniya’ Vijay arrested on abduction, assault charges

MORE FROM AUTHOR

RELATED ARTICLES