తాగుతున్నారు ఊగుతున్నారు..రోడ్లపైకి వచ్చి చంపేస్తున్నారు..

x
Highlights

తాగుతున్నారు...తాగి ఊగిపోతున్నారు. రోడ్లపైకి వచ్చి చంపేస్తున్నారు..రహదారిపైకి రావడమే పాపమన్నట్టుగా జనాలను యమలోకాలకు పంపించేస్తున్నారు. మొన్న రమ్య,...

తాగుతున్నారు...తాగి ఊగిపోతున్నారు. రోడ్లపైకి వచ్చి చంపేస్తున్నారు..రహదారిపైకి రావడమే పాపమన్నట్టుగా జనాలను యమలోకాలకు పంపించేస్తున్నారు. మొన్న రమ్య, నిన్న మస్తానీని మద్యం మత్తుతో మింగేశారు..మరి వీరిని పొట్టనపెట్టుకున్నది మద్యమా...మద్యం మత్తా...లిక్కర్‌ కిక్కులో ఊగిపోతున్న ప్రభుత్వమా...చట్టాల అమల్లో సామాన్యులకు ఒక న్యాయం, సెలబ్రిటీలకు మరో న్యాయమేంటి.

ఎవడు తాగి నడుపుతున్నాడో, ఎవడు తూలుతూ వాహనాన్ని చక్కర్లు కొట్టిస్తున్నాడో...ఎవడు మందుబాబో..ఎవడు విందుబాబో...ఎవడు కాలయయుడో....తెలీదు. ఎక్కడ నిషా కింకరుడు పొంచి ఉన్నాడో, ఏ మలుపు జీవితానికి చివరి మలుపు చేస్తాడో ఎవ్వరికీ తెలీదు. స్కూల్లో చేరిన మొదటిరోజే రమ్యకు చివరి రోజైంది. ఎన్నో ఆలోచనలతో రోడ్డు వెళ్తున్న మస్తానీకి ఆదివారమే ఆఖరిదినమైంది. హైదరాబాద్‌ రహదారులపై యమ కింకరుల రూపంలో మదమెక్కిన మందుబాబులు, జనాల ప్రాణాలను తోడేస్తున్నారు.

కల్లు మానండోయ్...కళ్లు తెరవండోయ్ అని స్వాతంత్ర్యోద్యమంలో పిలుపునిచ్చాడు మహాత్ముడు. కానీ నేడు 'మందు కొట్టండోయ్ బాబూ...కళ్లు మూయండోయ్ అంటున్నాయి ప్రభుత్వాలు. ఎడాపెడా టైమింగ్స్, ఎక్కడంటే అక్కడ వైన్‌ షాపులకూ అనుమతిస్తున్నాయి. తాగి ఊగుతూ వాహనాలు నడుపుతున్న మందుబాబులు, విచక్షణ మరిచి ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఇలా మందెక్కువైన వారిని పట్టిస్తోంది బ్రీత్‌ ఎనలైజర్. డ్రంకన్‌ డ్రైవ్‌లకు ఎలాంటి శిక్షలున్నాయి..చట్టాలేమంటున్నాయి?

ప్రతిరోజు ఫుల్లుగా తాగేసి రోడ్లపై రయ్యిమంటూ రేసింగ్‌లు పట్టుబడుతున్న వారిలో కాలేజీ కుర్రాళ్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, కార్మికులుడ్రంకన్‌ డ్రైవ్‌కు చిక్కుతున్నవారిలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య
పెరుగుతోంది. మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాల లెక్కలు, వీధినపడుతున్న కుటుంబాలను చూస్తే ఎవ్వరికైనా గుండె తరుక్కుమంటుంది. జరిమానాలు విధిస్తున్నారు. జైలుకెళుతున్నారు. కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయినా మందుబాబులకు బుద్ది రావడం లేదు. ప్రతిరోజు ఫుల్లుగా తాగేసి రోడ్లపై రయ్యిమంటూ రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. పట్టుబడుతున్న వారిలో కాలేజీ కుర్రాళ్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, చిన్నాచితకా ఉద్యోగం చేేసే ప్రైవేటు ఉద్యోగులే అధికం. అంతేకాదు, డ్రంకన్‌ డ్రైవ్‌కు చిక్కుతున్నవారిలో ఈమధ్య అమ్మాయిల సంఖ్యా పెరుగుతోంది. మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాల లెక్కలు, వీధినపడుతున్న కుటుంబాలను చూస్తే ఎవ్వరికైనా గుండె తరుక్కుమంటుంది.

సబ్‌ కో మాలూమ్‌ హై...మై షరాబీ నహీ. ఫిర్‌ బీ కోయీ పిలాయేతో మై క్యా కరూ....అంటే అందరికీ తెలుసు....నేను తాగుబోతును కాదని...అయినా ఎవరైనా మధువు తాగిస్తే నేను మాత్రం ఏం చేస్తాను...ఇలా మందుబాబులు, తాగను తాగనూ అంటూనే తెగ తాగేస్తున్నారు. కాదు కాదు ప్రభుత్వమే తాగిస్తోంది. అవును. ఖజానా నింపుకోవడానికి బార్లను బార్లా తెరుస్తున్నాయి ప్రభుత్వాలు. అర్థరాత్రి వరకూ మద్యం అమ్ముకోవడానికి పర్మిషన్లు ఇస్తున్నాయి. మరి మద్యం మత్తులో జరుగుతున్న యాక్సిడెంట్లకు ప్రభుత్వమూ ఒక కారణం కాదా?

Show Full Article
Print Article
Next Story
More Stories