యాంకర్‌ ప్రదీప్‌ కౌన్సిలింగ్‌కు ఈరోజే డెడ్‌లైన్‌

Submitted by arun on Mon, 01/08/2018 - 10:57

డ్రంక్  అండ్  డ్రైవ్ లో పోలీసులకు పట్టుబడి..తప్పించుకు తిరుగుతున్న ప్రముఖ యాంకర్  ప్రదీప్ నేడు  బేగంపేట ట్రాఫిక్  పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ కు హాజరుకానున్నారు. నిబంధనల ప్రకారం తల్లి లేదా భార్యను కౌన్సెలింగ్ కు తీసుకురావాల్సి ఉంటుంది. ప్రదీప్‌కు  పెళ్లి కాలేదు కాబట్టి తల్లిని తీసుకొని రావాలని నిబంధనలను పోలీసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సాయంత్రం లోపు ఎప్పుడైనా కౌన్సింగ్‌కు హాజరుకానున్నారు. దీంతో ఇవాళ అన్న ప్రదీప్‌ కౌన్సిలింగ్‌కు హాజరవుతాడా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. 

ప్రదీప్‌ కౌన్సిలింగ్‌‌కు నేటితో డెడ్‌లైన్‌ ముగియనుంది. ఒకవేళ డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో కౌన్సిలింగ్‌కు హాజరుకాకపోతే అరెస్ట్ వారెంట్‌ జారీ చేస్తామంటున్నారు పోలీసులు. ఇన్ని రోజులు బిజీ షూటింగ్‌ షెడ్యూల్‌ వల్లే కౌన్సిలింగ్‌కు హాజరుకాలేకపోయినట్లు ప్రదీప్‌ చెప్పారు. అయితే నేడు కౌన్సిలింగ్‌‌కు హాజరుకాకపోతే నిబంధనల ప్రకారం లిఖితపూర్వక అనుమతి కోరితే పరిశీలిస్తామన్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఏర్పాటు చేసుకున్న ఘటనలోనూ ప్రదీప్ పై పోలీసులు జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు. 

English Title
Drunk driving: Pradeep to attend counselling session

MORE FROM AUTHOR

RELATED ARTICLES