డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన యువతి చేసిన పని చూస్తే..

Submitted by chaitanya on Sun, 05/13/2018 - 11:32
drunk and drive test hyderabad

పోలీసులు ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు చేస్తున్నా....కేసులు బుక్‌ చేస్తున్నా...మద్యంరాయుళ్లు మారడం లేదు. తాగిన తర్వాత పోలీసులకు చిక్కకుండా కొంతమంది తెలివిగా ప్రవర్తిస్తుంటే...మరి కొందరు పోలీసులతోనే గొడవకు దిగుతున్నారు. ఇంకొందరు టెస్ట్‌లకు సహకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా...మద్యంప్రియులు తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్న విషయాన్ని గమనించి...వాహనంలో డ్రైవర్‌ సీటులో నుంచి పక్కకు తప్పుకుంటున్నారు. కొంతమంది పోలీసులకు దూరంగా కారును ఆపేసి వెళ్లిపోతుంటే...ఇంకొందరు డ్రైవరుని పిలిపించుకుంటూ జిమ్మిక్కులు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు-45లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఓ యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మద్యం బ్యాన్‌ చేయమంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ఫుల్లుగా మద్యం కొట్టిన యువతి, తనిఖీలు విషయం తెలుసుకుని...పోలీసులకు ఆమాడదూరంగా కారును ఆపేసింది. మీడియాను చూసి డ్రైవర్‌ సీటులో నుంచి దిగి...ఎస్‌బీహెచ్‌ ఎటీఎంలోకి పరుగులు తీసింది. మందు కొట్టిన యువతి ఏటీఎం సెంటర్‌లో డ్రస్‌ మార్చుకొని...తాపీగా బయటకు వచ్చింది. పోలీసుల దగ్గరకు వచ్చే సరికి తాను డ్రైవర్‌ సీటులో లేనని బుకాయించింది. అయితే ఏటీఎం సెంటర్‌లోకి ఎందుకు పరుగులు పెట్టిందో మాత్రం చెప్పడం లేదు. తాము తనిఖీలు చేస్తున్న సమయంలో కారులో డ్రైవర్‌ ఉన్నాడని...యువతి డ్రైవింగ్ స్థానంలో లేకపోవడంతో టెస్ట్‌లు చేయలేదని చిక్కడపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు. 13 కార్లు, 8 టూ వీలర్లను పోలీసులు సీజ్ చేశారు. టెస్టుల్లో పట్టుబడ్డ వారికి సోమవారం కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. కౌన్సిలింగ్ తర్వాత కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

English Title
drunk and drive test hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES