అందం కోసం ఆ క్రీములు వాడుతున్నారా..? ఇక అంతే..

Submitted by nanireddy on Tue, 09/18/2018 - 17:52
drug-controller-of-india-warns-people-over-fairness-creams

అందంగా కనిపించాలని ప్రతిఒక్కరికి ఉంటుంది.  ప్రస్తుతం ట్రెండ్‌ అంతా అందం చుట్టే తిరుగుతోంది. 16 ఏళ్ల అమ్మాయి నుంచి అరవై ఆరేళ్ళ ఏళ్ల బామ్మ వరకు.. అందరికి ఒకటే తపన. అదే.. అందంగా కనిపించాలని. అందుకు తగ్గట్టే మార్కెట్‌లో రకరకాల ఇల్లీగల్‌ క్రీముల పుట్టుకొస్తున్నాయి. వాటిని విక్రయిస్తూ..  జనాల్లో క్యాష్‌ చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. కేవలం అందం కోసమే మార్కెట్లో కోట్లలో వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఆ ఇల్లీగల్‌ క్రీముల వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిదని అంటున్నారు వైద్యనిపుణులు. దీనికి కారణం లోలోపల చర్మాన్ని పాడు చేసే డేంజరస్‌ స్టెరాయిడ్స్‌ వాటిలో నిక్షిప్తమై ఉంటాయని అంటున్నారు. కలర్‌ కోసం ఆరాటపడితే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు. 
  అవి  వాడకం వలన కొన్ని రోజులు చర్మం నిగనిగలాడుతున్నా అందులో ఉండే స్టెరాయిడ్స్‌ కారణంగా క్యాన్సర్ రావొచ్చని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇల్లీగల్ క్రీముల వలన చర్మం రంగు మారి కొద్ది రోజులకే పాలిపోయి అవకాశముందని వారంటున్నారు. అందువల్ల అనుభవజ్ఞులైన డెర్మటాలజిస్ట్ సూచించే కాస్మొటిక్స్ వాడితే మంచిదని అంటున్నారు. 

English Title
drug-controller-of-india-warns-people-over-fairness-creams

MORE FROM AUTHOR

RELATED ARTICLES