విశాఖలో అప్పుడే మొదలైన నీటి కష్టాలు

x
Highlights

విశాఖలో తాగునీటి సమస్య డేంజర్ బెల్స్ మోగిస్తోంది ప్రస్తుతం నగరంలో వున్న అన్ని ప్రధాన జలాశాయాలు అడుగంటిపోతున్నాయి. ఈ ఏడాది 84% లోటు వర్షపాతం నమోదు...

విశాఖలో తాగునీటి సమస్య డేంజర్ బెల్స్ మోగిస్తోంది ప్రస్తుతం నగరంలో వున్న అన్ని ప్రధాన జలాశాయాలు అడుగంటిపోతున్నాయి. ఈ ఏడాది 84% లోటు వర్షపాతం నమోదు కావడంతో జలాశయాల్లో నీటి శాతం డెడ్ స్టోరేజ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం నిండుకుండలా ఉండాల్సిన జలాశయాలు నీరు లేక బీటలు వారుతున్నాయి నగర ప్రజలకు ప్రధాన జలవనరైన రిజర్వాయర్లు అడుగంటి పోవడంతో ఈ వేసవిలో నీటి కష్టాలు తప్పేలా లేదు.

విశాఖకి గంభీరం, మేహాద్రి, ముడసర్లోవ ప్రధాన జలవనరులు. అయితే ప్రస్తుతం సీటీకీ ఆనుకుని వున్న ముడసర్లోవ నీటీమట్టం పూర్తిగా తగ్గిపోయింది. 70 ఎకరాల వీస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్ గరీష్ట నీటీ మట్టం 169 అడుగులు, ప్రస్తుతం ఇది పూర్తిగా అడుగంటి పోయింది. నీటితో నిండుకుండలా ఉండాల్సిన రిజర్వాయర్ నీరులేక చనిపోయిన జీవరాసుల కళేబరాలతో దర్శనమిస్తోంది.. ప్రస్తుతం ఈ జలాశయం 50 కాలనీలకు కూడా నీరు అందించే పరిస్థితి లేదు.

మేహాద్రి రిజర్వాయర్‌లో కూడా నీటి నిల్వలు ఘననీయంగా పడిపోయాయి సుమారు 66 అడుగుల నీటి నిల్వల సామర్ధ్యంగల ఈ రిజర్వాయర్ లో ప్రస్తుతం డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంది. విశాఖ నగరానికి మరో ప్రధాన నీటి వనరు గంభీరం జలాశయం నగరానికి నీరు అందించే గంభీరం గెడ్డ ఎడారిని తలపిస్తుంది ఈ జలాశయంలో ప్రస్తుతం నీటి చుక్కలేదు జలాశయం పరిశర ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు జరగడం చుట్టూ కాంక్రీటు రహదారుల నిర్మించడంతో కొండలపై నుంచి నీరు జలాశయంలోకి చేరడం లేదు దీంతో జలాశయం అడుగంటి పోయింది. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ఇప్పటికే పరిశ్రమలకు, వ్యవసాయ అవసరాలకు నీటి పంపిణీ శాతం తగ్గించారు అయినా తాగునీటి సమస్య సవాల్ గా మారింది. శీతాకాలంలోనే పరిస్థితి ఇలా వుంటే రాబోయే వేసవి ని ఏలా ఎదుర్కోవాలో అని అధికారులు సతమత మవుతున్నారు. ప్రత్యామ్నాయాల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. మరి ఈ తీవ్ర నీటి ఎద్దడిని అధికారులు, ప్రజలు ఏవిధంగా ఎదుర్కుంటారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories