ద్రవిడ్‌కు అరుదైన గౌరవం

ద్రవిడ్‌కు అరుదైన గౌరవం
x
Highlights

మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ద్రావిడ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు దుబాయ్‌లో...

మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ద్రావిడ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు దుబాయ్‌లో జరిగిన కార్యక్రమంలో రాహుల్‌ ద‍్రవిడ్‌కు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు కల్పించిన విషయాన్ని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక‍్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ స్పష్టం చేశారు. ద్రవిడ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌, ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు మాజీ వికెట్‌ కీపర్‌ క్లెయిర్‌ టేలర్‌లకు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న వారిలో ఉన్నారు. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఈ ఘనత దక్కించుకున్న ఐదో భారత ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌. గతంలో బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌, అనిల్‌ కుంబ్లేలు భారత తరపున హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించిన ఆటగాళ్లు. ఇక ఆసీస్‌ తరపున హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న 25వ ఆటగాడు పాంటింగ్‌ కాగా, ఈ ఘనత సాధించిన ఏడో మహిళా క్రికెటర్‌ టేలర్‌. ఇంగ్లండ్‌ తరపున మూడో క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు సాధించారు..

‘క్రికెట్‌ గేమ్‌లో దిగ్గజ ఆటగాళ్లు ఎవరైతే ఉన్నారో వారికి ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం కల్పించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. వరల్డ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన వారికి ఇచ్చే గుర్తింపు ఇది. ఈ సందర్భంగా రాహుల్‌ ద‍్రవిడ్‌, రికీ పాంటింగ్‌, టేలర్‌లను అభినందిస్తున్నా’ అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌సన్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories