నైటీ ధరిస్తే రూ.2 వేలు జరిమానా

నైటీ ధరిస్తే రూ.2 వేలు జరిమానా
x
Highlights

సర్వ సాధారణంగా అయితే ట్రాఫిక్ పోలీసుల వద్ద, ప్రభుత్వ పరమైన చర్యలను ఉల్లగిస్తే జరిమానా విధింపు ఉంటుంది. అయితే ఒక ఊరిలో అయితే ఆడవాళ్లు నైటీలు ధరిస్తే...

సర్వ సాధారణంగా అయితే ట్రాఫిక్ పోలీసుల వద్ద, ప్రభుత్వ పరమైన చర్యలను ఉల్లగిస్తే జరిమానా విధింపు ఉంటుంది. అయితే ఒక ఊరిలో అయితే ఆడవాళ్లు నైటీలు ధరిస్తే మాత్రం అక్కడ జరిమాన చెల్లించల్సిందే. ఇందంత ఏ ప్రపంచంలోనో, దేశంలోనో కాదు మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని పశ్చిమగోదావరి జిల్లా తోకలపల్లి గ్రామంలో ఈ వింత ఆచారం ఉంది. ఈ ఉరిలో తొమ్మండుగురు మంది పెద్ద మనుషులు కలిసి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ తీర్మాణంలో పొద్దుగల 7 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య ప్రాంతానా ఆడవాళ్లు నైటీ వేసుకోరాదని ఖరాఖండిగా అందరి సమక్షంలో తీర్మానించింది. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లగిస్తే రూ. 2వేల రూపాల జరిమాన విధించారు. ఉదయం మహిళలు నైటీ ధరించిన సమాచారం ఇచ్చిన వారికి రూ. 1000 రూపాలు బహుమానం కూడా ప్రకటించారు. అయితే ఈ ముచ్చట కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ ఊరి రెవెన్యూ అధికారి విచారణ చేపట్టారు. ఈ విషయంపై గ్రామ సర్పంజ్ ను నీలదీయగా మహిళలు సంప్రదాయంగా, గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ సర్పంచ్ మహాలక్షీ వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories