మరోసారి భారత్‌ను టార్గెట్ చేసిన ట్రంప్‌

Highlights

డోనాల్డ్ ట్రంప్‌ మరోసారి కొరడా ఝుళిపించేందుకు రెడీ అవుతున్నారు. నైపుణ‌యం ఉన్న భారతీయులను అమెరికా నుంచి వెనక్కి పంపేందుకు రెడీ అవుతున్నారు....

డోనాల్డ్ ట్రంప్‌ మరోసారి కొరడా ఝుళిపించేందుకు రెడీ అవుతున్నారు. నైపుణ‌యం ఉన్న భారతీయులను అమెరికా నుంచి వెనక్కి పంపేందుకు రెడీ అవుతున్నారు. గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకొని హెచ్‌1బీ వీసాపై నివాసముంటున్న వారిని వెనక్కి పంపడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది ట్రంప్‌ సర్కార్‌. అమెరికన్లకే ఉద్యోగాలంటున్న డోనాల్డ్ ట్రంప్‌ హెచ్‌1బీ వీసాలను పొడిగించకపోతే దాదాపు లక్ష మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది.

అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల సంఖ్యను తగ్గించటానికీ అమెరికన్లకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు ట్రంప్‌ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హెచ్‌1బీ నిబంధనలను కఠినతరం చేయటం, హెచ్‌ 4 వీసాలపై నియంత్రణలతో పాటు మరో కొత్త నిబంధనను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నిబంధనను అమలు చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకునేందుకు డీహెచ్‌ఎస్ అంతర్గత మెమోను జారీ చేసింది. దీని ప్రకారం గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ నిపుణులకు గడుపు పొడిగింపులు ఇకపై ఇవ్వరు.

ప్రతి ఏడాది 85 వేల మందికి అమెరికా హెచ్‌1బీ వీసాలు మంజూరు చేస్తుంది. వీటిలో 70 శాతం భారతీయులకే దక్కుతున్నాయ్. వీరిలో ఎక్కువ మంది కంప్యూటర్‌ సిస్టమ్స్‌ ఎనలిస్ట్‌, అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామర్స్‌గా పనిచేసేవారే ఎక్కువ. గత రెండేళ్ళుగా కంపెనీల వీసాల వినియోగం సగానికి సగం పడిపోయాయ్. మొత్తం 85వేల మంది వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే భారతీయులకు కేవలం పదివేలు మాత్రమే మంజూరయ్యాయ్.

గతంలో గ్రీన్‌కార్డు చాలా సులభంగా లభించేది. విదేశీ నిపుణుల సంఖ్య పెరుగుతుండటంతో గ్రీన్‌కార్డు కోసం వేచి చూడాల్సిన సమయం పెరిగింది. ఒకప్పుడు నాలుగేళ్లలో గ్రీన్‌కార్డు లభించేది. ఇప్పుడు ఎంత కాలం పడుతుందో తెలియదు అసలు వస్తుందో లేదో కూడా తెలియదని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్‌ సర్కారు ప్రతిపాదనపై భారత ఐటీ కంపెనీల ప్రతినిధి సంస్థ నాస్కాం తన ఆందోళను తెలియజేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories