నేనెప్పుడైనా నిన్ను కొవ్వెక్కిన పొట్టోడా అన్నానా : డోనాల్డ్ ట్రంప్

Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. నిన్న మొన్నటివరకు ప్రకటనలకు మాత్రమే...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. నిన్న మొన్నటివరకు ప్రకటనలకు మాత్రమే పరిమితమైన వీరి మాటల యుద్ధం నేడు వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళింది.. మొన్న ట్రంప్ ను దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ " ట్రంప్ ఒక ఓల్డ్ మ్యాన్ అని సెటైర్ వేశాడు" దీనికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బదులిస్తూ నేను నిన్ను ఎప్పుడైనా "బాగా కొవ్వుపట్టి లావుగా, పొట్టిగా ఉన్నావు" అని విమర్శించినా అని ట్రంప్ బదులిచ్చాడు.. అసలు నేను అలంటి వ్యాఖ్యలు చెయ్యను నా స్నేహితుడిని నేను ఆలా అనను.. ఒకవేళ ఎదోఒకరోజు ఆలా అంటానేమో అని కిమ్ జాంగ్ కు రివర్స్ పంచ్ వేశాడు ట్రంప్..

కాగా ఉత్తర కొరియాతో ఎలాగైనా అణ్వాయుధాల అభివృద్ధిని నియంత్రించాలనే ఉద్దేశ్యంతో ఆసియాలోని కీలక దేశాలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తున్నారు. దీంతో ఆయనపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.మరోవైపు అణ్వాయుధాల అభివృద్ధిని ఎవరు నిరోధించలేరని కిమ్‌ జాంగ్‌ ఉన్‌ స్పష్టం చేశారు. ఇక నుంచి అణ్వాయుధాల వేగాన్ని మరింత పెంచుతామని తెలిపారు. తమకు వ్యతిరేకంగా శక్తులను కూడగడుతున్న వ్యక్తిగా, విధ్వంసకుడిగా, కొరియన్ ద్వీపకల్పంలో యుద్ధాన్ని కోరుకుంటున్న వ్యక్తిగా ట్రంప్‌ను అభివర్ణించారు...

Show Full Article
Print Article
Next Story
More Stories