అమెరికా నుంచి కారులో ఇండియా చేరుకున్న భారతీయ జంట

Submitted by arun on Thu, 06/14/2018 - 14:05
doctor couple

అమెరికాలో నివసిస్తున్న భారతీయ జంట...ఇండియాకు వెళ్లాలని నిర్ణయించుకుంది. విమానంలో వెళ్తే థ్రిల్ ఏముంటుందని రాజేశ్‌ కపాడియా, దర్శన్‌లు భావించారు. ఆలోచన వచ్చిందే తడువుగా...సొంతం వాహనంలో ఇండియాకు రావాలని అనుకున్నారు. అందుకు అనుగుణంగా కారులో నిత్యావసర వస్తువులు, సిలిండర్లు ఇలా అన్ని రెడీ చేసుకున్నారు. హోం రన్‌ పేరుతో అమెరికా నుంచి యాత్రను ప్రారంభించారు. యాత్రలో ప్రతి కదలికలను...తమ కుటుంబసభ్యులకు తెలిసేలా జీపీఎస్‌ సిస్టమ్‌ను వాహనానికి అనుసంధానం చేశారు. ఇండియాకు చేరే క్రమంలో చైనా మిలట్రీ విభాగం...వీరి వాహనానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో 17వేల కిలోమీటర్లు చుట్టూ తిరిగి...చివరికి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాజేశ్‌, దర్శన్‌ల జంట...61 రోజుల్లో 19 దేశాల్లో 37వేల కిలోమీటర్లు ప్రయాణించి...ఇండియాకు చేరుకున్నారు. తమ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను స్నేహితులతో పంచుకున్నారు రాజేశ్‌, దర్శన్‌లు. 

English Title
doctor couple america to hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES