చాణుక్య రాజ‌నీతి గురించి తెలుసా మీకు..?

Submitted by lakshman on Wed, 02/07/2018 - 20:35
Chanakya Neeti Telugu

పట్టుదలకు పౌరుషానికి, లౌక్యానికి, తెలివితేటలకు కేరాఫ్ అడ్రస్ అంటే చాణుక్యుడు. చాణుక్యుడు రాజనీతి అలా ఉంటుంది. నేటి సమాజంలో సందర్భానుసారం చాణుక్యుణ్ని అనుకరించాల్సిందే. లేదంటే  మనం రాణించడం చాలా కష్టం. అలా రాణించాలంటే చాణుక్యుడు చెప్పిన నియమాలు పాటించాల్సిందే. అవి ఎక్కడైనా సరే. ఆఫీసులో కానీ, ఇంటర్వూలో కానీ ఇలా అన్నింట్లో ఉపయోగపడుతుంది. 
1మీరు నడుస్తున్న దారిని అందరూ హర్షించేలా ఉండాలి. అలా కాకుండా మిమ్మల్ని ఎవరైనా నిందిస్తున్నారంటే వెంటనే అలావాట్లైనా,అభిరుచుల్ని మార్చుకోండి. 
2.మీ స్నేహితులతో విజ్ణానపరమైన సంబంధాలపై చర్చించుకోండి. 
3.నిజాయితీగా ఉంటూ అనాగరికంగా మీతో వాదించే వాళ్లతో దూరంగా ఉండండి. మీరు ఎప్పుడైతో అలాంటి వారిని దూరం చేస్తారో వారే మిమ్మల్ని చూసి నేర్చుకునే స్థాయికి వస్తారు.  ఎందుకంటే అలాంటి వారివాల్ల మీరు మానసికంగా కృంగిపోతారు. 
4.ఎవరైనా మీమ్మల్ని అజ్ణానులు అంటే వెంటనే లైట్ తీసుకోండి. అలా వదిలేయడం వల్ల మీరు అనుకున్న లక్ష్యాల్ని సాధించగలుగుతారు. 
5.మీకు ఎవరైనా పని అప్పగిస్తే గాడిద చాకిరి చేయకుండా ఆలోచించి ఉపయోగపడేలా చేయండి. లేదంటే వదిలేయండి
6.మీరు ఎంత కష్టపనినైనా ఇష్టపడి చేస్తారో ఆరోజు మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మీరు ఎంత కష్టపడినా దానికి ఫలితం లేదని నిరుశ్చహాపడకూడదు. ఎందుకంటే మీకు సంతృప్తి దొరుకుతుంది. అప్పుడే మీసంస్థకు తెలుస్తోంది మీరే విలువైన ఉద్యోగి అని. 
7.బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అనే వర్డ్ కాలేజీలోనే కాదు మీ ఆఫీసులుకూడా వర్తిస్తుంది. మీతోటి ఉద్యోగులతో స్నేహంగా ఉండండి.  
8.మీ పర్సనల్ విషయాల్ని మీ ఫ్రెండ్ తో షేరు చేసుకునేముందు వాళ్లు మీతో నిజాయితీగా ఉంటున్నారా లేదా అనేది చూడండి. లేదంటే మిమ్మల్ని చులకన చేస్తారు. అలాంటి సందర్భాలను నిత్యం ఎక్కడో చోట తారసపడుతున్నాయి. అందుకే పనిచేసే సంస్థల్లో పర్సనల్ విషయాలను షేర్ చేయకండి. 
9.మీ అభిరుచుల్ని ప్రతీ ఒక్కరితో పంచుకోండి. ధనికుడా, పేదవాళ్ల అనేది బేరీజు వేసుకోకండి. ఎందుకంటే వాళ్లే మీ విజయాన్ని కోరుకునేది. 
10.కూడు..గుడ్డ..నీరు ప్రతీ ఒక్కరి ప్రాథమిక అవసరాలు. అందుకే మీరు ప్రతీ ఒక్కరితో కలుపుగోలుగా ఉండండి. అప్పుడే మీరు చేసే పనిని సులభంగా చేయగలుగుతారు. లేదంటే ప్రతీ ఒక్కరు మిమ్మల్ని వేలెత్తి చూపిస్తారు. 
11.మీకు సిగ్గు బిడియం ఉంటే అలాంటి అంశాల్ని ముందుగా మీ తోటి ఉద్యోగులతో, బాస్ తో చర్చించండి. లేదంటే మీ ఆఫీస్ మీటింగ్ లో ఆకట్టుకోలేరు.  

English Title
do you know about chanakya raja neeti

MORE FROM AUTHOR

RELATED ARTICLES