భారత్‌లో మరోసారి ‘విరుష్క’ వివాహం?

Submitted by arun on Sun, 01/14/2018 - 10:55
Virat

మొన్నామధ్యే ఇటలీలో విరాట్ కోహ్లీ, అనుష్కలు పెళ్లి చేసుకుకుని, ఇండియాలో ఘనంగా విందు కూడా ఇచ్చారుగా? వీరి మధ్య మళ్లీ పెళ్లేంటని అనుకుంటున్నారా? నిజమేనంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇటలీలో పెళ్లి చేసుకోవడంతో, వీరికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించినట్టు సమాచారం. దీంతో పెళ్లి ధ్రువీకరణ కోసం వీరు ఇండియాలో మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. ఇటలీలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత సామాజిక మాధ్యమాల ద్వారా తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తరువాత దిల్లీ, ముంబయిలో వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం న్యూఇయర్‌, దక్షిణాఫ్రికా టెస్ట్‌ మ్యాచ్ నిమిత్తం ఇద్దరూ కేప్‌టౌన్‌ వెళ్లారు. వేడుకలు పూర్తయ్యాక అనుష్క ముంబయి తిరిగి వచ్చేసింది. మరి భారత్‌లో మరోసారి వివాహం గురించి ‘విరుష్క’ జోడీ ఏమంటారో వేచి చూడాల్సిందే..!

English Title
Do Virat And Anushka Need To Remarry?

MORE FROM AUTHOR

RELATED ARTICLES