కొత్త పాస్ పుస్తకాలకు నో చాన్స్

కొత్త పాస్ పుస్తకాలకు నో చాన్స్
x
Highlights

తెలంగాణలో కొత్త పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీకి మరింత ఆలస్యం కానుంది. ప్రభుత్వం మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకే రోజు కొత్త పాస్...

తెలంగాణలో కొత్త పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీకి మరింత ఆలస్యం కానుంది. ప్రభుత్వం మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకే రోజు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చెయ్యాలనుకున్నా అనేక సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. పాస్‌బుక్‌ల ముద్రణకు ప్రైవేటు సంస్థలు ముందుకు రాకపోవడం ఓ కారణమైతే.. ఇంత తక్కువ సమయంలో దాదాపు 75 లక్షల పాస్ బుక్కులు ముద్రించడం అసాధ్యంగా మారింది.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కొత్త పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ పక్రియ అలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. స్వల్ప మార్పులతో పాత తరహాలోనే కొత్త పాస్ బుక్కులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ ఒకే రోజు పాస్ బుక్కులు పంపిణీ చేయాలని తెలంగాణ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. భూ రికార్డుల ప్రక్షాళన తరువాత రాష్ట్ర్రంలో దాదాపు 75 లక్షల మంది రైతులు ఉన్నట్టుగా లెక్కతేలింది. వీరందరికి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది. అయితే కేవలం 30 రోజుల్లోనే అనేక సెక్యూరిటీ ఫీచర్స్ తో 75 లక్షల పాస్ పుస్తకాలు ముద్రించలేమని ప్రైవేటు సంస్థలు చేతులెత్తేశాయి.

దాదాపు 20 సెక్యూరిటీ ఫీచర్స్ తో కొత్త పాస్ బుక్కులు తయారు చేయడం అసాధ్యంగా మారడంతో ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. దీంతో ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లోనే పాస్ పుస్తకాలు ముద్రించాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. అయితే సర్కారు కోరుతున్న సెక్యూరిటీ ఫీచర్స్ ఇవ్వడం అసాధ్యమని ప్రభుత్వ ప్రింటింగ్ అధికారులు కూడా చేతులెత్తేయడం విశేషం. టాంపరింగ్‌కు సాధ్యం కాకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్‌బుక్‌లు రూపొందించాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఎలా ఉన్నా వాటిని ముద్రించడంలో ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులను అందుకు తీసుకునే సమయాన్ని గురించి ప్రభుత్వం ఆలోచించకపోవడంతో పాస్ పుస్తకాల పంపిణీ ఆలస్యం అవుతుంది.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మింట్ కాంపౌండ్ ముద్రణాలయంలో పాస్ పుస్తకాలు ముద్రించాలని భావిస్తున్నారు. ఇందులో అయితే రోజుకు రెండున్నర లక్షల వరకు పాస్ బుక్కులు ముద్రించే సౌలభ్యం ఉండడంతో కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ తగ్గించి ముద్రణ బాధ్యత అప్పగించాలని యోచిస్తున్నారు. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని పనులు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తి కొత్త పాస్ పుస్తకాలకు బదులుగా.. స్వల్ప మార్పులు చేసి పాత పద్ధతిలోనే కొత్త పుస్తకాలు ఇవ్వడం దాదాపు ఖాయంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories