అప్పుడే విడుదల... అంతలోనే మాయం

అప్పుడే విడుదల... అంతలోనే మాయం
x
Highlights

ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది. కానీ అది బయటకు రాదు. బయటకు రావడం సంగతి అంటుంచితే ..కనీసం ఆ జీవో వచ్చిన సంగతే ఎవరికీ తెలియదు. ఎందుకంటే జీవో విడుదల...

ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది. కానీ అది బయటకు రాదు. బయటకు రావడం సంగతి అంటుంచితే ..కనీసం ఆ జీవో వచ్చిన సంగతే ఎవరికీ తెలియదు. ఎందుకంటే జీవో విడుదల చేసిన శాఖల్లో కానీ ప్రభుత్వ వెబ్ పోర్టల్‌లో కానీ ఎక్కడా అది కనిపించదు. ఇలా... పదో..ఇరవయ్యో కాదు...వందో..రెండు వందలో కాదు..20 వేలకు పైగా జీవోలను రహస్యంగా విడుదల చేసి..అదృశ్యం చేసేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలేవీ ప్రజలకు తెలియకుండాపోతోంది. కేసీఆర్ సర్కార్ చాలా విషయాల్లో గాప్యంగా వ్యవహరిస్తోంది. ప్రజలకు సంబంధించిన వి‍షయాల్ని, తెలియాల్సిన అంశాల్ని వారికే అందుబాటులో లేకుండా చేస్తోంది. పారదర్శకంగా ఉంచాల్సిన జీవోలను రహస్యంగా తెచ్చి... అంతే గుట్టుగా ఉంచుతోంది. అంతేకాదు...ప్రభుత్వ సమాచారాన్ని దాచి పెట్టి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును కాలరాస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వేలాది జీవోలను విడుదల చేసింది. నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వుల దగ్గర్నుంచి..,పనుల మంజూరు, అప్పులు, వడ్డీలు, సంక్షేమ పథకాలకు చెందిన ఉత్తర్వులు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే చాలా జీవోలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టడంలేదు. ఏ పనికి ఎంత విడుదల చేశారు...ఏ అవసరాల కొసం ఎంత మంజూరు చేశారు..వంటి జీవోలు చాల వరకు చీకటి గదుల్లోనే మగ్గుతున్నాయి. ఇలా దాదాపు 20,383 జీవోలను గుట్టు చప్పుడు కాకుండా విడుదల చేసి అంతే కాన్పిడెన్షియల్‌ మోడ్‌లో ఉంచారు.

జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్, మైనారిటీ సంక్షేమ శాఖలో దాదాపు 4,207 జీవోలను ప్రభుత్వం అదృశ్యం చేసింది. ఎంతో కీలకమైన ఐటీ, మున్సిపల్, ఇండస్ట్రీస్ శాకల్లో దాదాపు 1,417 జీవోలను కాన్పిడెన్షిల్‌గా ఉంచారు. ఆర్థిక, ప్రణాళిక, పౌరసరఫరాల శాఖలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 2,763 జీవోలను సామాన్యులకు అందుబాటులోకి లేకుండా చేశారు. వ్యవసాయ శాఖలో 1,368 జీవోలు, పశు సంవర్థక శాఖలో 68, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో 393 జీవోలు పబ్లిక్ డొమైన్‌లో లేకుండా పూర్తిగా రహస్యంగా ఉంచారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఇదే పరిస్థితి. జీవోల గోప్యత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సచివాలయ ఉద్యోగులే పెదవి విరుస్తున్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదని అంటున్నారు. అయితే జీవోలన్నింటిని వెబ్ సైట్‌లో పెట్టడం వల్ల కొంత మంది అనసరంగా కోర్టులకు వెళ్తున్నారని అందుకే ప్రజలకు అవసరం లేని కొన్ని జీవోలను మాత్రమే రహస్యంగా ఉంచుతున్నమని అధికారులు చెప్పుకొస్తున్నారు. డిపార్ట్‌మెంట్ హెడ్స్ మాత్రమే చూసేలా వెబ్ సైట్‌లో ప్రత్యేక అప్షన్ పెట్టి అందులో ఉంచుతున్నామని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories