ఆ నటికి శేఖ‌ర్ క‌మ్ముల వార్నింగ్‌

ఆ నటికి శేఖ‌ర్ క‌మ్ముల వార్నింగ్‌
x
Highlights

కొందరు దర్శకులు, నిర్మాతలు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు చేస్తూ ఓ తెలుగు నటి సోషల్‌మీడియాలో సంచలనాత్మక పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రముఖ...

కొందరు దర్శకులు, నిర్మాతలు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు చేస్తూ ఓ తెలుగు నటి సోషల్‌మీడియాలో సంచలనాత్మక పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ములను కూడా ఉద్దేశిస్తూ సోమవారం ఆమె ఓ పోస్ట్‌ పెట్టారు. దీనిపై శేఖర్ కమ్ముల సీరియస్‌గా స్పందించారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. 'నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది.

నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం.'అంటూ శేఖ‌ర్ క‌మ్ముల హెచ్చ‌రించారు. స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను.

Show Full Article
Print Article
Next Story
More Stories