‘భాగమతి’పై మారుతి కామెంట్

Submitted by arun on Fri, 01/26/2018 - 12:51
bhagamathi

అరుంధతి, రుద్రమదేవి లాంటి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో ఆకట్టుకున్న అనుష్క లీడ్‌ రోల్‌ లో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా భాగమతి. పిల్ల జమీందార్ మూవీకి దర్శకత్వం వహించిన అశోక్ ఈ సినిమాను రూపొందించారు. అనుష్క లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసిన డైరెక్టర్ మారుతి సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.
 
‘‘అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో కూడిన సినిమా అయిన భాగమతిని చూశాను. అనూహ్య మలుపులతో కూడిన ఓ హార్రర్ సినిమా.. సినిమాలోని ట్విస్టులు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అనుష్క గారూ యు ఆర్ ది బెస్ట్. యూవీ క్రియేషన్స్‌కి అభినందనలు. డైరెక్టర్ అశోక్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, టీంలోని ప్రతి ఒక్కరూ సాలిడ్ హిట్‌కు కారకులే’’ అని ట్వీట్ చేశారు మారుతి.

English Title
director maruthi tweet about bhagamathi

MORE FROM AUTHOR

RELATED ARTICLES