ఈ నగరానికి ఏమైంది : కొరటాల శివ

Submitted by chandram on Fri, 12/07/2018 - 17:33
koratala siva

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంది. ఓటర్లు తమ బాధ్యతగా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే హైదరాబాద్ మహానగరంలో ఎన్నికల పోలింగ్ శాతంపై ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ స్పందించాడు. అసలు ఈ హైదరాబాద్ మహానగరానికి ఏమైందని సమయం 3గంటలు దాటింది. ఇప్పటి వరకు 35శాతమే నమోదు కావడం సిగ్గుచేటు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర ఓటర్లపై తీవ్రస్థాయిలో అని ట్విటర్‌లో మండిపడ్డారు. గతంలోనూ హైదరాబాద్ లో 50శాతం మించలేదు. కాగా తెలంగాణ వ్యాప్తంగా 56.17 శాతమే పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఒక్క మెదక్ నియోజకవర్గంలో ఓటర్లు తమ ఓటును భారీ సంఖ్యలో వినియోగించుకున్నారు. మెదక్‌లో 75.75శాతం పోలింగ్‌ నమోదు కాగా యాకుత్‌పురాలో మాత్రం అతి దారుణంగా  32శాతం నమోదవడం గమనార్హం.

English Title
Director Koratala Siva Disappointed For Hyderabad Polling Percentage

MORE FROM AUTHOR

RELATED ARTICLES