సాయి పల్లవిపై వచ్చిన రూమర్స్ గురించి స్పందించిన దిల్ రాజు..!

Submitted by nanireddy on Tue, 12/19/2017 - 18:01
Dil Raju's response to Rumors over Sai Pallavi

టాలీవుడ్ లో దిల్ ఉన్న నిర్మాత ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది దిల్ రాజు  ఈ ఏడాది తన బ్యానర్ లో కొనేదెల వారబ్బాయి వరుణ్ తేజ్ హీరోగా అల్లరమ్మాయి సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన  'ఫిదా' చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ యాసలో మాట్లాడి సాక్షాత్తు సీఎం నే మెప్పించిన సాయిపల్లవికి ఈ సినిమా విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చింది. దీంతో ఫిదా చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో దిల్ రాజు తదుపరి చిత్రమైన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాలో కూడా ఛాన్స్ కోటేసింది ఈ అమ్మడు. కాగా  ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల కానుండగా. MCA (మిడిల్ క్లాస్ అబ్బాయ్) చిత్రానికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ, సాయిపల్లవి గురించి కొన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారం గురించి స్పందించారు..

"ఈ సినిమా కోసం ఇచ్చిన కాల్షీట్లను సాయిపల్లవి ఎగ్గొట్టిందనే వార్తల్లో నిజం లేదు. ఆమె బిజీగా ఉండటం వలన కొన్ని డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది. ఆ తరువాత తన కారణంగా షూటింగ్ ఆలస్యం కాకుండా సహకరించింది. ఇక ఆమె సమయానికి షూటింగ్ కి రాకుండా టీమ్ ను ఇబ్బంది పెట్టునట్టుగా కూడా రాశారు .. అందులోను నిజం లేదు. చెప్పిన సమయానికి ఆమె షూటింగ్ కి వచ్చేసేది. ఇక 'శ్రీనివాస కల్యాణం' కథ విని సాయిపల్లవి చేయనందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అసలామె ఇంతవరకూ ఆ కథనే వినలేదు" అంటూ దిల్ రాజు స్పష్టతనిచ్చారు..

English Title
Dil Raju's response to Rumors over Sai Pallavi

MORE FROM AUTHOR

RELATED ARTICLES