పవన్, మహేష్ ఇచ్చిన షాక్ లో దిల్ రాజు

పవన్, మహేష్ ఇచ్చిన షాక్ లో దిల్ రాజు
x
Highlights

పెద్ద హీరోల సినిమాలను నిర్మించాలని..డిస్టిబ్యూట్ చేయాలని మూవీ మేకర్స్ తెగ పోటీపడతారు. కానీ దిల్ రాజు మాత్రం ఇక అలాంటి తప్పు చేయనంటున్నాడు. పెద్ద హీరోల...

పెద్ద హీరోల సినిమాలను నిర్మించాలని..డిస్టిబ్యూట్ చేయాలని మూవీ మేకర్స్ తెగ పోటీపడతారు. కానీ దిల్ రాజు మాత్రం ఇక అలాంటి తప్పు చేయనంటున్నాడు. పెద్ద హీరోల పేర్లు చెబితేనే ఆమాడ దూరం పరిగెడుతున్నాడు. పవన్, మహేష్ ఇచ్చిన షాక్ తో ఇంకా కోలుకోలేకపోతున్నాడు.

పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీని నమ్ముకున్న దిల్ రాజు నిట్ట నిలువునా మునిగిపోయాడు. మార్కెట్ లో పవన్ కి ఉన్న క్రేజ్ ను, సినిమాపై నెలకొన్న హైప్ ను ద్రుష్టిలో పెట్టుకోని అజ్ఞాతవాసి మూవీపై భారీగా పెట్టుబడి పెట్టాడు. అజ్ఞాతవాసి నైజాం రైట్స్ ను 29కోట్లు పెట్టి కొన్నాడు. కానీ సినిమా ఫ్లాప్ తో పెట్టుబడిలో సగం కూడా రాలేదు. 29కోట్లు పెట్టి కొంటే, కేవలం 11కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే 18కోట్లు నష్టం వచ్చింది.

అజ్ఞాతవాసి మూవీ కంటే ముందు మహేష్ కూడా దిల్ రాజును నట్టేటా ముంచేశాడు. స్పైడర్ మూవీ తెగ ఆడేస్తుందనుకొని నైజాం రైట్స్ కొన్నాడు. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో 12కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఎన్టీఆర్ జై లవ్ కుశ మూవీతో, కొద్దిలో న‌ష్టాల నుంచి తప్పించుకున్నాడు దిల్ రాజు. సినిమా ఆడినా పెట్టుబడిని కూడా రాబట్టలేకపోయింది. అంతకు ముందు ఓం నమో వెంకటేశాయా మూవీతో నష్టాలు వచ్చాయి..దీంతో మరోక సారి పెద్ద సినిమాలను నమ్మి మోసపోవొద్దనుకున్నాడు. అందుకే మహేష్ భరత్ అనే నేను మూవీకి దూరంగా ఉంటున్నాడు. భరత్ అనే నేను మూవీకి అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్టైన, దిల్ రాజు దూరంగానే ఉంటున్నాడు.

టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాల కంటే చిన్న సినిమాలే లాభదాయకంగా మారాయి. సినిమా బడ్జెట్ తక్కువ కాబట్టి..తక్కువ మొతాదులో రిలీజ్ రైట్స్ కొనుక్కోవచ్చు. సినిమా బాగుంటే లాభాల పంటపడుతుంది. ఒకవేళ సినిమా ఆడకపోయినా పెద్దగా నష్టమేమి ఉండదు. కానీ పెద్ద సినిమాల విషయానికి వచ్చే సరికి మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. భారీగా డబ్బులు పెట్టి రైట్స్ కొనడంతో..సినిమా ఆడినా అక్కడికక్కడికే సరిపోతోంది. పెద్దగా లాభాలు రావు, ఇక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం భారీగా నష్టాల్లో మునగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories