ముగ్గురు అగ్రహీరోల సినిమా హక్కులూ దిల్ రాజువే

Submitted by lakshman on Thu, 09/14/2017 - 16:26

2017లో టాలీవుడ్‌లో బాగా సంపాదించిన నిర్మాత ఎవరన్నా ఉన్నారంటే అది దిల్ రాజ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది ఆరంభంలో శతమానం భవతి, ఆ తర్వాత నేను లోకల్, డీజే, తాజాగా ఫిదా సినిమాతో హిట్లు మీద హిట్లు కొడుతూ ఈ బడా ప్రొడ్యూసర్ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు దిల్ రాజు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టాలీవుడ్ బడా హీరోలు మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ సినిమాల నైజాం హక్కులను భారీ మొత్తానికి కొనేసి మిగతా నిర్మాతలను ఆశ్చర్యానికి గురి చేశాడు. దిల్ రాజు ముందు డిస్ట్రిబ్యూటర్, ఆ తర్వాతే నిర్మాత. అయినప్పటికీ దిల్ రాజు ఎందుకింత సాహసం చేస్తున్నాడని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

స్పైడర్, జైలవకుశ చిత్రాల నైజాం హక్కులను ఇప్పటికే సొంతం చేసుకున్న దిల్ రాజు.. తాజాగా పవన్ 25వ సినిమా రైట్స్‌ను కూడా కొనేశాడు. జైలవకుశ, స్పైడర్ సినిమాల నైజాం హక్కులను 29 కోట్లకు కొన్న దిల్ రాజు, పవన్, త్రివిక్రమ్ సినిమా రైట్స్‌ను 20 నుంచి 22 కోట్ల మధ్యలో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పవన్, త్రివిక్రమ్ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. 

English Title
dil raj decision gives shock to other producers

MORE FROM AUTHOR

RELATED ARTICLES