కొత్త రికార్డులు సృష్టిస్తున్న డిజిల్

Submitted by admin on Wed, 08/29/2018 - 12:39

మార్కెట్ ఇచ్చిన రెక్కలోచ్చే డీజిల్ ధరలకు,
చుక్కల్లో వెళుతుండే అసలు చమురు ధరలు,
పెట్రోల్ కూడా ఆల్ టైమ్ రికార్డుకు ఇక దొరలు,
సామాన్యుడిపైనే భారం పెంచే ఈ అసాధారణ ధరలు


డీజిల్ ధరలు ఎప్పుడు పెరగనంతగా పెరిగి .. కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా ధరలు పెంచుతున్నాయి.. అలాగే పెట్రోల్ కూడా ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరేందుకు సిద్ధంగా వున్నట్టు కనిపిస్తుంది. ఢిల్లీలో డీజిల్ ధర రూ. 69.91కి చేరగా, ముంబైలో రూ. 73.90ని తాకగా, చెన్నైలో రూ. 72.46కి చేరింది. పెట్రోల్ ధరలు కూడా ఢిల్లీలో రూ. 78.05కి, ముంబైలో రూ. 85.47కు చేరగా, కోల్ కతాలో రూ. 80.98కి చేరింది. ఇక చెన్నైలో ధర రూ. 81.09.మరో అర్ధరూపాయి పెరిగితే పెట్రోల్ కూడా మళ్ళీ ఆల్ టైమ్ రికార్డును చేరే అవకాశముంది. ఈ ధరలు పెరిగి చివరికి సామాన్యుడిపైనే భారం పెరుగుతుంది.

English Title
diesel prices were growing rapidly

MORE FROM AUTHOR

RELATED ARTICLES