పాక్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ వార్తలపై ద్రవిడ్‌ క్లారిటీ

పాక్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ వార్తలపై ద్రవిడ్‌ క్లారిటీ
x
Highlights

తాను పాక్‌ ఆటగాళ్ల డ్రస్సింగ్‌ రూమ్‌కి వెళ్లినట్లు వస్తున్న వార్తలను అండర్‌-19 భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కొట్టి పారేశాడు....

తాను పాక్‌ ఆటగాళ్ల డ్రస్సింగ్‌ రూమ్‌కి వెళ్లినట్లు వస్తున్న వార్తలను అండర్‌-19 భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కొట్టి పారేశాడు. న్యూజిలాండ్‌లో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు సోమవారం ముంబయి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ ద్రవిడ్‌, జట్టు సారథి పృథ్వీ షా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా ఒక విలేకరి టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో సెమీఫైనల్‌ అనంతరం మీరు ఆ జట్టు డ్రస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లు, టీమ్‌ మేనేజర్‌తో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకు వెళ్లారు? అని అడగ్గా..'నేను పాకిస్తాన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లలేదు. కేవలం పాక్‌ జట్టులోని ఒక లెఫార్మ్‌ పేసర్‌ని మాత్రమే అభినందించా. అది కూడా డ్రెస్సింగ్‌ రూమ్‌కి బయటే. అంతేకానీ వారి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి వారితో ఎటువంటి చర్చలు జరపలేదు. ఆ క్రమంలోనే పాకిస్తాన్‌ కోచ్‌ మన కుర్రాళ్లు బాగా ఆడారని అభినందించారు. అంతవరకూ మాత్రమే జరిగింది' అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories