తాడిపత్రిలో కొలిక్కి వచ్చిన ఆశ్రమ వివాదం..

తాడిపత్రిలో కొలిక్కి వచ్చిన ఆశ్రమ వివాదం..
x
Highlights

రెండు రోజులుగా భగ్గుమంటున్న తాడిపత్రి ప్రబోధానంద స్వామి ఆశ్రమ వివాదం చల్లారింది. ప్రబోధానంద స్వామి ఆశ్రమాన్ని పోలీసులు ఎట్టకేలకు ఖాళీ చేయిస్తున్నారు....

రెండు రోజులుగా భగ్గుమంటున్న తాడిపత్రి ప్రబోధానంద స్వామి ఆశ్రమ వివాదం చల్లారింది. ప్రబోధానంద స్వామి ఆశ్రమాన్ని పోలీసులు ఎట్టకేలకు ఖాళీ చేయిస్తున్నారు. ఆయన శిష్యులను రెండు బస్సుల్లో తరలిస్తున్నారు. ఆశ్రమాన్ని ఖాళీ చేయించాలంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నిన్నటి నుంచి చేస్తున్న ఆందోళనతో దిగివచ్చిన అధికారులు ప్రబోధానంద ఆశ్రమంపై చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు ఆశ్రమం ఖాళీ చేయిస్తుండంతో రెండు రోజులుగా తాడిపత్రి పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తున్న ఎంపీ జేసీ తన నిరసనను విరమించారు.

తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామంలో శనివారం గణేశ్‌ నిమజ్జనం నిర్వహిస్తున్న సమయంలో వివాదం చెలరేగింది. తమపై రంగులు చల్లారంటూ ప్రబోధానంద ఆశ్రమంలోని కొందరు భక్తులు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. మాటమాట పెరగడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గ్రామస్తులకు చెందిన వాహనాలతో పాటు రెండు బండల ఫ్యాక్టరీలను ఆందోళనకారులు తగులబెట్టారు.

ఇటు సీన్‌లోకి ఎంటర్‌ అయిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రెండు రోజులుగా గ్రామశివారులో తిష్టవేసి ఆందోళన చేపట్టారు. ఆశ్రమంలో అసాంఘీక కార్యకలాపాలు సాగుతున్నాయని విమర్శించారు. ఆశ్రమాన్ని సీజ్‌ చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో పరిస్థితిని సమీక్షించిన పోలీసులు 144 సేక్షన్‌ విధించారు. అంతేకాకుండా నిమజ్జనం వేడుకలను కూడా వాయిదా వేశారు. పరిస్థితి విషమించే అవకాశం ఉండటంతో సుమారు 2 వేల మంది పోలీసులు మోహరించారు.

ఇదిలా ఉంటే తాడిపత్రి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. హోంశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజీ వద్దంటూ అధికారులకు ఆదేశించారు. దీంతో ప్రబోధానంద ఆశ్రమం ఖాళీ చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. తర్వాత ఆశ్రమం లోపల శిష్యులతో చర్చలు జరిపిన అధికారులు వారిని స్వస్థలాలకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆధార్‌ కార్డు ఉంటేనే ఆశ్రమంలో ఉండేందుకు అనుమతిచ్చిన పోలీసులు మిగతావారిని ప్రత్యేక బస్సుల్లో వారి వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. దీంతో రెండు రోజులుగా ఆశ్రమం దగ్గరే ఆందోళన కొనసాగించిన జేసీ శాంతించారు. తన ఆందోళనను విరమించారు.

Image removed.

Show Full Article
Print Article
Next Story
More Stories