నారావారిపల్లెలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా దేవాన్ష్‌

Submitted by arun on Wed, 01/17/2018 - 11:12

నారావారి పల్లిలో ఏటా జరిగే సంక్రాంతి సంబరాల్లో ఈసారి సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ దేవాన్ష్‌. ఇద్దరు తాతల ముద్దుల మనవడిగా దేవాన్ష్‌.. పల్లె వాసుల హృదయాలను చూరగొన్నాడు. ముద్దులొలికే ముఖ్యమంత్రి మనవడిని చూసి నారావారిపల్లె మురిసిపోయింది. నారావారిపల్లెలో నారా-నందమూరి కుటుంబాల సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. కనుమ సందర్భంగా నారా వారి ఇంటిలో రకరకాల 
వంటలు ఘుమఘుమలాడాయి.

నారా-నందమూరి సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు-బాలకృష్ణ మనవడు దేవాన్ష్  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈరోజు ఎద్దుల బండెక్కిన దేవాన్ష్ తల్లి బ్రహ్మణితో ఊరంతా చక్కర్లు కొట్టాడు. నారావారి సంక్రాంతి సంబరాల్లో దేవాన్ష్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు ఇద్దరు తాతలతో కలిసి దేవాన్ష్ సంబరాలు చేసుకున్నాడు. తొలి రోజు భోగినాడు తిరుమలలో తాత చంద్రబాబుతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నాడు. తాత ఒళ్లో కూర్చొని గారాలు పోయాడు. 

ఇక రెండో రోజు నారావారి పల్లెకు తాత బాలయ్యతో కలిసి వెళ్లిన దేవాన్ష్ అక్కడ ఇద్దరు తాతల ముద్దుల మనవడిగా అలరించాడు. తాత బాలయ్య దేవాన్ష్ తో బాక్సింగ్  ఆడుకున్నాడు. ఏపీ సీఎం చంద్రబాబుకు సాక్షాత్తు మనువడు అంతే కాదు ఆంధ్రుల సూపర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు మనువడు. అందుకే ఈ ముద్దుల మనువడు మూడు రోజుల పండుగను మూడు రకాలుగా చేసుకొని మనవడా మజాకా అనిపించాడు.

English Title
Devansh Bullock Cart Riding in Naravaripalli

MORE FROM AUTHOR

RELATED ARTICLES