నేను అమాయ‌కుణ్ని..న‌న్నుఒగ్గేయండి : రేపిస్ట్ బాబా

Highlights

బేల చూపులు.., ఏడుపులు..., వేడుకోళ్ళు..., సహాయ నిరాకరణలు..., ఇవీ రోహ్‌తక్ కోర్టులో ఇవాల్టి దృశ్యాలు. డేరా బాబాకు శిక్ష ఖరారు చేసే సమయంలో కనిపించిన...

బేల చూపులు.., ఏడుపులు..., వేడుకోళ్ళు..., సహాయ నిరాకరణలు..., ఇవీ రోహ్‌తక్ కోర్టులో ఇవాల్టి దృశ్యాలు. డేరా బాబాకు శిక్ష ఖరారు చేసే సమయంలో కనిపించిన సన్నివేశాలు. అంతేకాదు...బాబాను జైలు సెల్ కు తీసుకెళ్ళగానే సీబీఐ కోర్టు ఆయనకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

జైలు లైబ్రరీ గదిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో మొత్తం 9 మంది. జడ్జి ముందు దోషి గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్. కోర్టు బయట... జైలు చుట్టూ... ఏకే ఫోర్టీ సెవెన్లతో బీఎస్ఎఫ్ జ‌వాన్ల పహారా. కోర్టు బయటా...కోర్టు లోపలా... గుర్మీత్ కు చెందిన లక్షలాది భక్తుల్లోనూ ఒకటే టెన్షన్. బాబాకు ఏ శిక్షపడుతుందోనని.

వాదనలు ప్రారంభమయ్యాయి. మీరేమైనా చెప్పదలుచుకున్నారా అంటూ జడ్జి జ‌గ‌దీప్ సింగ్...గుర్మీత్ సింగ్ ను అడడటం ఆలస్యం. ఆయనలో భావోద్వేగం కట్టలు తెంచుకుంది. అందరీకీ ఎన్నో ధైర్యవచనాలు చెప్పే బాబా... కళ్లల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. ఎంతో వినయంగా చేతులు కట్టుకుని నిల్చుని తాను అమాయకుడినని చెప్పుకొచ్చారు. కుట్రతో కేసులో ఇరికించారని వాదించారు. తనను క్షమించాలని వేడుకున్నారు. అయినా న్యాయ‌మూర్తి మాత్రం 10 ఏళ్ళ జైలు శిక్ష ఖరారు చేశారు.

తీర్పు వెలువడిందో లేదో మళ్ళీ బాబా సెంటిమెంట్ పండించారు. బోరున విలపించారు. తాను సోషల్ వర్కర్‌నని, తన సేవలను పరిగణనలోకి తీసుకోవాలని చేతులు జోడించి విన్నవించుకున్నారు. భవిష్యత్ కళ్ళముందు కదిలేసరికి హఠాత్తుగా కుప్పకూలారు. కొంత సేపటికి తేరుకున్న ఆయన... కోర్టు హాలు నుంచి బయటకు వెళ్లడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు బాబాను బలవంతంగా బయటకు తీసుకువెళ్ళారు. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి జైలు సెల్ కు తరలించారు.

అంతేకాదు..జైలు అధికారుల తీరుపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్మీత్‌ను సాధారణ ఖైదీలాగే చూడాలని ఆదేశించారు. అతణ్ణి వీఐపీలాగా చూడటమేంటని ప్రశ్నించిన జ‌గ‌దీప్ సింగ్...కారాగాంలో కూడా వీఐపీ కల్చారా అంటూ చివాట్లు పెట్టారు. ఇక తీర్పు ఇచ్చిన కొద్దిసేపటి తర్వాత ఎవరూ ఊహించని విధంగా దానిని సవరించారు. రెండు కేసుల శిక్షలు ఏకకాలంలో అనుభవించడం కుదరదు కాబట్టి... విడివిడిగా అమలు చేయాలని తేల్చి చెప్పారు. ఒక్కో కేసులో పదేళ్ళ చొప్పున...మొత్తం 20 ఏళ్ళపాటు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు..ఒక్కో రేప్‌ కేసులో 15 లక్షల చొప్పున జరిమానా విధించి..ఆ మొత్తంలో బాధిత మహిళలకు 14 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

మొత్తానికి ఇన్నాళ్లూ కళ్లుమిరుమిట్లు గొలిపే రంగురంగుల డ్రస్సులు వేసుకున్న డేరా బాబా 20 ఏళ్లపాటు వాటికి దూరంగా ఉండాల్సి వచ్చేలా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories